పెళ్ళై ఒక కొడుకున్న వ్యక్తితో సోనియా ఆకుల వివాహం, బిగ్ బాస్ బ్యూటీకి కాబోయే భర్త ఎవరో తెలుసా?

First Published | Oct 18, 2024, 6:17 PM IST

బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ సోనియా ఆకులకు యష్ అనే వ్యక్తితో పెళ్లి కుదిరింది. కాగా యష్ కి గతంలో వివాహమైంది. అతడికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. 
 

Bigg boss telugu 8


సోనియా ఆకులపై సోషల్ మీడియాలో అత్యంత నెగిటివిటీ నడిచింది. హౌస్లో ఆమె ప్రవర్తన పట్ల ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోనియా ఆకులను ఎలిమినేట్ చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపించింది. నాలుగో వారం సోనియా నామినేషన్స్ లోకి వచ్చింది. ప్రేక్షకులు ఆమెకు ఓట్లు వేయలేదు. 

Bigg boss telugu 8

సోనియా ఆకుల ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. సోనియాతో హౌస్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన నిఖిల్, పృథ్విరాజ్ ఆవేదనకు గురయ్యారు. నిఖిల్ కన్నీరు పెట్టుకున్నాడు. బయటకు వచ్చిన సోనియా ఆకుల ఎపిసోడ్స్ చూసి షాక్ అయినట్లు తెలుస్తుంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనను చాలా తప్పుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

సోనియా ఆకుల మాట్లాడుతూ.. నేను హౌస్లో కిచెన్ చూసుకున్నాను. రేషన్ మేనేజ్ చేశాను. టాస్క్ లలో సత్తా చాటాను. అవేమీ చూపించలేదు. కేవలం నిఖిల్, పృథ్విలతో ఉన్నదే చూపించారు. మరి అదైనా పూర్తిగా చూపించారా.. అంటే లేదు. ముందు వెనుక కట్ చేసి చూపించారు. అలా ఎందుకు చేశారో బిగ్ బాస్ టీమ్ ని అడగాలి. 


Bigg boss telugu 8

నిఖిల్, పృథ్విలతో నా బాండింగ్ సిస్టర్, మదర్ వంటిది. వాళ్ళను అలానే చూశాను. అందుకే పెద్దోడు, చిన్నోడు అనే దాన్ని. పృథ్వి, నిఖిల్ లను హగ్ చేసుకున్నది చూపించారు. అంతకు ముందు ఏం జరిగింది అనేది చూపించలేదు. అందుకే ఆడియన్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు. 

నేను ఓ టాస్క్ లో పోరాడి గెలిచాను. అందుకే పృథ్వి నన్ను హగ్ చేసుకుని కిస్ చేశాడు. నేను గెలిచినందుకు నా కంటే వారే ఎక్కువ సంతోషపడ్డారు. నా సంతోషాన్ని ఆ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక అబ్బాయిని మరో అబ్బాయి కూడా విన్నింగ్ స్పిరిట్ లో హగ్ చేసుకుంటాడు. కిస్ చేస్తాడు. నా విషయంలో దాన్ని అపార్థం చేసుకునేలా చూపించారు. 
 

Bigg boss telugu 8

ఒక ఎపిసోడ్ లో చేశారంటే ఓకే... కానీ ప్రతి ఎపిసోడ్లో అదే చేశారు. హౌస్లో అంత మంది ఉంటే నన్నే టార్గెట్ చేశారు. నేను చేతులు ఎక్కడ పెట్టినా జూమ్ చేసి మరీ చూపించారు. మరీ అంత క్రూరంగా చూపిస్తారా.. ఒకరి కెరీర్ ఏమవుతుంది. వాళ్లకు నేనొక్కదాన్నే టార్గెట్ అయ్యాను. 

హౌస్లో చాలా మంది బూతు పదాలు వాడారు. కేవలం పృథ్విని మాత్రమే నాగార్జున ప్రశ్నించాడు. యష్మి నా పై చాలాసార్లు విమర్శలు చేసింది. అయినా నేను భరించాను. నామినేషన్స్ లో పృథ్వి, నిఖిల్ లను నేను వాడుకుంటున్నాను అంది. యష్మి వలె నేను దిగజారలేదు... అని అన్నారు. 

Bigg boss telugu 8


బిగ్ బాస్ మేకర్స్ తనను కావాలనే తప్పుగా చూపించారని కోణంలో ఆమె మాట్లాడారు. మరో ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త వివరాలు ఆమె తెలియజేశారు. పెళ్ళై ఓ కొడుకు ఉన్న వ్యక్తిని సోనియా పెళ్లి చేసుకోనుంది. సోనియాను వివాహం చేసుకోబోయే వ్యక్తి పేరు యష్. ఓ రెండేళ్ల క్రితం వీరికి పరిచయమైందట. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. 

యష్-సోనియా ఆకుల కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు. అయితే యష్ కి ఆల్రెడీ వివాహమైంది. భార్యతో అతడు విడిపోయాడు. విడాకులు తీసుకున్నాడు. యష్ కి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఏడాది వ్యవధిలో యష్ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు మరణించారట. అందువలన వివాహం ఆలస్యమైందట. 

Bigg boss telugu 8

కాగా ప్రేక్షకులు నిజాయితీగా గేమ్ ఆడేవారిని మాత్రమే సపోర్ట్ చేస్తారు. మొదటి వారం నుండి సోనియా గేమ్ పరిశీలిస్తే .. నిజాయితీ  కనిపించలేదు. ఫేక్ ఎమోషన్స్, ఫేక్ రిలేషన్స్ ఆమె కొనసాగించింది. అత్యంత సన్నిహితంగా ఉండే నిఖిల్ ని ఉద్దేశించి కూడా ఇతర కంటెస్టెంట్స్ తో తప్పుగా మాట్లాడేది. కంటెస్టెంట్స్ ని పర్సనల్ గా టార్గెట్ చేయడం కూడా సోనియాకు మైనస్ అయ్యింది.

విష్ణుప్రియపై సోనియా వ్యక్తిగత ఆరోపణలు చేసింది. నీ డ్రెస్సింగ్ అసభ్యకరంగా ఉంటుంది. అడల్ట్ జోక్స్ వేస్తావు, అడల్ట్ కంటెంట్ ఇస్తున్నావు. నీకు ఫ్యామిలీ లేదంటూ ఘాటైన విమర్శలు చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ ప్రవర్తన, గేమ్ పై విమర్శలు చేయవచ్చు. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని ప్రేక్షకులు సహించరు. 

సోనియా ఆటిట్యూడ్, బిహేవియర్ సైతం అభ్యంతరకరంగా ఉండేవి. పృథ్విరాజ్, నిఖిల్ తో ఆమె ప్రవర్తన చాలా అసభ్యంగా ఉండేది. మేల్ కంటెస్టెంట్స్ తో సోనియా ఇబ్బందికర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోనియా పై అందుకే విపరీతమైన నెగిటివిటి నడిచింది.

Latest Videos

click me!