నీకు క్యారెక్టర్ లేదు, నువ్వు అందరికీ ముద్దులు పెడతావ్, విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ!

First Published | Sep 20, 2024, 6:23 PM IST

విష్ణుప్రియ-ప్రేరణ టాస్క్ లో పరస్పరం వాదులాటకు దిగారు. వ్యక్తిగత కామెంట్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఎవరు రైట్? ఎవరు రాంగ్? అనే చర్చ మొదలైంది. 
 

Bigg boss telugu 8

బిగ్ బాస్ హౌస్లో వాతావరణం హీటెక్కింది. నిఖిల్-అభయ్ క్లాన్స్ టాస్క్ లో గెలిచేందుకు హోరాహోరీ తపడుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న టాస్క్ లో సమయానుసారంగా వచ్చే గుడ్లను సేకరించాల్సి ఉంటుంది. సేకరించిన గుడ్లను భద్ర పరుచుకోవాలి. 
 

Bigg Boss Telugu 8

టాస్క్ ముగిసేనాటికి ఎవరి వద్ద ఎక్కువ గుడ్లు ఉంటాయో ఆ టీమ్ విన్ అవుతుంది. గుడ్లను సేకరించడంతో పాటు కంటెస్టెంట్స్ దాచుకోవడం, దోచుకోవడం చేశారు. కొందరు తమ బట్టల్లో కూడా దాచుకున్నారు. లేడీ కంటెస్టెంట్స్ బట్టల్లో దాచుకున్న గుడ్లను బయటకు తీసేందుకు ఇతర లేడీ కంటెస్టెంట్స్ వెనకాడలేదు. 

అభయ్ క్లాన్ మెంబర్స్ గా ఉన్న ప్రేరణ, యష్మి గట్టిగా పోరాడారు. మొదటి నుండి నిఖిల్ క్లాన్ ది పై చేయిగా ఉంది. నిఖిల్ ప్రత్యర్థిగా ఉన్న మరో చీఫ్ అభయ్ తేలిపోవడం, అతడు గట్టిగా పోరాడకపోవడం మైనస్ అవుతుంది. అలాగే నిఖిల్ టీమ్ తో పోల్చుకుంటే అభయ్ టీమ్ వీక్ గా ఉంది. 
 


ప్రేరణ వద్ద నుండి గుడ్లు లాక్కునే క్రమంలో విష్ణుప్రియ కొంచెం కటువుగా ప్రవర్తించింది. దాంతో ప్రేరణ 'క్యారెక్టర్ లెస్' అని తిట్టింది. ఈ వీడియోను విష్ణుప్రియ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అది ఎంత పెద్ద ఆరోపణ, అంటూ ప్రేరణపై ఫైర్ అవుతున్నారు. దీనికి కౌంటర్ గా ప్రేరణ ఫ్యాన్స్ మరో వీడియో తెరపైకి తెచ్చారు. 

ఆ వీడియోలో ప్రేరణను ఉద్దేశిస్తూ విష్ణుప్రియ.. అందరికీ ముద్దులు పెడుతూ తిరుగుతుంది, అన్నది. ప్రేరణది తప్పైతే విష్ణుప్రియ చేసిందేంటి అని... ఆమె ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రేరణ-విష్ణుప్రియ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. 

ఏది ఏమైనా గేమ్ లో టెంపర్ కోల్పోయి వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం సరికాదనే వాదన వినిపిస్తోంది. విష్ణుప్రియ పై వ్యక్తిగత ఆరోపణలు చేసిన సోనియాను నెటిజెన్స్ తిట్టిపోశారు. విష్ణుప్రియ జోక్స్, ఆమె డ్రెస్సింగ్ ని ఉద్దేశిస్తూ ఘాటైన విమర్శలు చేసింది సోనియా. అలాగే నీకు ఫ్యామిలీ లేదని ఎద్దేవా చేసింది. సోనియా వరస్ట్ ప్లేయర్ అని జనాలు ఫైర్ అయ్యారు. 
 

మరోవైపు పృథ్విరాజ్ సైతం గేమ్ లో టెంపర్ కోల్పోతున్నాడు. మాటలు జారుతున్నాడు. పృథ్విరాజ్ చర్యలు సమర్ధనీయంగా లేవు. అతడికి హోస్ట్ నాగార్జున గట్టిగా వార్నింగ్ ఇచ్చే సూచనలు కలవు.  

గత రెండు వారాల్లో బేబక్క, శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. ఇక థర్డ్ ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. విష్ణుప్రియ, నాగ మణికంఠ, అభయ్, పృథ్విరాజ్, యష్మి, ప్రేరణ, నైనిక, సీత నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. 

Abhai Naveen Bigg bos8

మెజారిటీ పోల్స్ ప్రకారం నటుడు అభయ్ రేసులో వెనుకబడ్డాడట. అతడికి తక్కువ మొత్తంలో ఓట్లు పోల్ అయ్యాయట. పృథ్విరాజ్-అభయ్ డేంజర్ జోన్లో ఉండగా, పృథ్విరాజ్ సేఫ్, అభయ్ ఎలిమినేట్ అయ్యాడనే న్యూస్ వైరల్ అవుతుంది. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

Latest Videos

click me!