బిగ్ బాస్ తెలుగు 8: హౌస్లోకి వస్తున్న 8 మంది వైల్డ్ కార్డ్స్ ఫైనల్ లిస్ట్, చివర్లో ఊహించని ట్విస్ట్!

First Published | Oct 6, 2024, 12:04 PM IST

బిగ్ బాస్ ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు మేకర్స్ వైల్డ్ కార్డ్స్ ని దించుతున్నారు. ఈ క్రమంలో మినీ లాంచ్ ఈవెంట్ కి రంగం సిద్దమైంది.

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలై ఐదు వారాలు అవుతుంది. ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం వరుసగా ఇంటి బాట పట్టారు. నైనిక సైతం బిగ్ బాస్ ఇంటిని వీడనుందని సమాచారం. ఓటింగ్ లో వెనుకబడ్డ నైనిక 6వ ఎలిమినేషన్ అంటున్నారు.

Bigg boss telugu 8

ఇక హౌస్లో 8 మంది ఉంటారు. కాగా మరో 8 మంది వైల్డ్ కార్డ్ ద్వారా వస్తున్నారనేది విశ్వసనీయ సమాచారం. వారిని పరిచయం చేసేందుకు మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో సైతం విడుదల చేశారు. ఆల్రెడీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ని నాగార్జున భయపెట్టే ప్రయత్నం చేశాడు. 

వైల్డ్ కార్డ్స్ తో మామూలుగా ఉండదు. వారు సామాన్యులు కాదు, జాగ్రత్తగా ఉండాలని నాగార్జున హెచ్చరించాడు. వైల్డ్ కార్డ్స్ మాకు అతిథులు. చక్కగా మర్యాదలు చేస్తాము. అనంతరం మెల్లగా ఇంటికి పంపిస్తామని, విష్ణుప్రియ విశ్వాసం వ్యక్తం చేసింది. వాళ్ళను ఓడించి నేను టైటిల్ గెలుచుకుంటానని ప్రేరణ.. నాగార్జునతో అన్నారు. 


Bigg boss telugu 8

ఇక హౌస్లో ఉన్న 8 మంది ఒక క్లాన్, కొత్తగా వస్తున్న వైల్డ్ కార్డ్స్ మరొక క్లాన్ గా బిగ్ బాస్ విభిజిస్తాడట. వీరి మధ్య భీకర యుద్ధాలు జరగనున్నాయి అనేది, లేటెస్ట్ న్యూస్. గత సీజన్స్ లో సత్తా చాటిన కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇకపై గేమ్ అంత సులభం కాదు. 

వైల్డ్ కార్డ్స్ కి అనుభవం కూడా అడ్వాంటేజ్. ఈ వైల్డ్ కార్డు ఎంట్రీల ఫైనల్ లిస్ట్ లీకైంది. సీజన్ 1 కంటెస్టెంట్ హరితేజ వస్తుంది. నటి హరితేజ బిగ్ బాస్ తెలుగు 1 ఫైనలిస్ట్. టైటిల్ రేసులో నిలిచిన హరితేజ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ సీజన్లో వెండితెర పాప్యులర్ నటులు కంటెస్టెంట్ చేసిన విషయం తెలిసిందే. 

సీజన్ 4లో కంటెస్ట్ చేసిన గంగవ్వ, జబర్దస్త్ అవినాష్ సైతం వైల్డ్ కార్డ్ ఎంట్రీల లిస్ట్ లో ఉన్నారు. గంగవ్వ ఐదు వారాలకు పైగా ఉన్నారు. ఆమె అనారోగ్య కారణాలతో ఎలిమినేట్ కాకుండానే ఇంటిని వీడారు. గంగవ్వ కారణంగా గేమ్ డిస్టర్బ్ అవుతుందనే విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ మరోసారి ఆమెకు బిగ్ బాస్ షోకి వచ్చే ఛాన్స్ దక్కింది. 

సీజన్ 4లో అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అవినాష్ గొప్ప ఎంటర్టైనర్. బుల్లితెర ఆడియన్స్ లో పాపులారిటీ ఉన్న నటుడు. అవినాష్ సక్సెస్ఫుల్ గా పది వారాలకు పైగా హౌస్లో ఉన్నాడు. మెహబూబ్ సైతం వస్తుండగా... ఇతడు కూడా సీజన్ 4 కంటెస్టెంట్. మెహబూబ్ 10వ వారం ఎలిమినేట్ అయ్యాడు. మెహబూబ్ ఆ సీజన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకడు. 

సీజన్ 7 లో కంటెస్టెంట్  చేసిన గౌతమ్ కృష్ణ కు సైతం మరో ఛాన్స్ దక్కింది. గౌతమ్ పది వారాలకు పైగా ఉన్నాడు. ఇదే సీజన్లో కంటెస్ట్ చేసి టేస్టీ తేజ సైతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు. టేస్టీ తేజ మంచి ఎంటర్టైనర్. 9వ వారం ఎలిమినేట్ అయ్యాడు. 

నయని పావని సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. మరోసారి ఆమెకు వైల్డ్ కార్డ్ ద్వారా సీజన్ 8లో ఛాన్స్ దక్కింది. గత సీజన్లో ఆమె కేవలం ఒక వారమే హౌస్లో ఉంది. నయని పావని ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అన్న వాదన వినిపించింది. సీజన్ 8లో నయని పావని ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. 
 

Nayani Pavani

వైల్డ్ కార్డ్ లిస్ట్ లో ఉన్న మరో మాజీ కంటెస్టెంట్ రోహిణి. జబర్దస్త్ కమెడియన్ గా పాపులర్ అయిన రోహిణి సీజన్ 3లో కంటెస్ట్ చేసింది. అయితే పెద్దగా రాణించలేదు. నాలుగో వారమే ఎలిమినేట్ అయ్యింది. కాబట్టి గంగవ్వ, హరితేజ, నయని, అవినాష్, గౌతమ్, మెహబూబ్, టేస్టీ తేజ, రోహిణి వైల్డ్ కార్డ్ తో హౌస్లో అడుగుపెడుతున్నారు. 

యాంకర్ రవి వస్తున్నట్లు ప్రచారం జరిగింది. ట్విస్ట్ ఇస్తూ ఆయన చివరి నిమిషంలో తప్పుకున్నాడట. యాంకర్ రవి సీజన్ 8లో కంటెస్ట్ చేయడం లేదట. అలాగే శోభా శెట్టి సైతం నిరాకరించినట్లు సమాచారం. మొత్తంగా ఒకప్పుడు ఎంటర్టైన్ చేసిన మాజీ కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ షో రసవత్తరంగా మారనుంది అనడంలో సందేహం లేదు. 

బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి 

Latest Videos

click me!