ప్రస్తుతం హౌస్లో 11 మంది ఉన్నారు. 5వ వారం మినీ లాంచ్ ఈవెంట్ ఉంటుందని సమాచారం. సీజన్ 7 నుండి ఈ విధానం అమలులోకి తెచ్చారు. మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి వైల్డ్ కార్డ్ ద్వారా ఐదుగురు కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపుతున్నారు. గత సీజన్లో అర్జున్ అంబటి, నయని పావని, పూజ, భోలే, అశ్విని శ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.
ఈసారి అనూహ్యంగా మాజీ కంటెస్టెంట్స్ హౌస్లోకి వస్తున్నారని టాక్. జబర్దస్త్ అవినాష్, నటి హరితేజ, రోహిణి ఈ లిస్ట్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. రెండు వారాల్లో దీనిపై క్లారిటీ రానుంది.
బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.