Bigg Boss Telugu Season 8: ఏకంగా ఆ టాలీవుడ్ హీరోని దించుతున్న టీమ్... ఇక హౌస్లో రచ్చ రచ్చే!

Published : Aug 18, 2024, 04:03 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి సమయం దగ్గర పడుతుంది. క్రేజీ సెలెబ్స్ నేమ్స్ తెరపైకి వస్తున్నాయి. కాగా బిగ్ బాస్ టీం ఏకంగా టాలీవుడ్ హీరోని కంటెస్టెంట్ గా రంగంలోకి దింపుతుందట.   

PREV
16
Bigg Boss Telugu Season 8: ఏకంగా ఆ టాలీవుడ్ హీరోని దించుతున్న టీమ్... ఇక హౌస్లో రచ్చ రచ్చే!
Bigg Boss Telugu Season 8

బిగ్ బాస్ షో అత్యంత ఆదరణ కలిగిన రియాలిటీ షో. తెలుగులో గత ఏడేళ్లుగా సక్సెస్ఫుల్ గా సాగుతుంది. ప్రతి సీజన్ కి బిగ్ బాస్ షో చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతూ పోతుంది. పల్లె ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులకు కూడా బిగ్ బాస్ షోని అమితంగాఇష్టపడుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. 

26
Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో సీజన్ 8 పై అంచనాలు పెరిగాయి. విడుదలైన బిగ్ బాస్ తెలుగు 8 ప్రోమోలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఈసారి ట్విస్ట్స్, ఫన్, ఎంటర్టైన్మెంట్ కి లిమిట్ లేదని హోస్ట్ నాగార్జున హామీ ఇస్తున్నాడు. సీజన్ 8 ఎలా డిజైన్ చేశారనే ఉత్సుకత కలుగుతుంది. 

 

36
Bigg boss telugu 8

కాగా సీజన్ సక్సెస్ కంటెస్టెంట్స్ ఎంపికపై ఆధారపడి ఉంది. బాగా తెలిసిన సెలెబ్రిటీలు, గేమ్ ఇంట్రెస్టింగ్ ఆడే కంటెస్టెంట్స్ హౌస్లో ఉంటే ప్రేక్షకులు మజా ఫీల్ అవుతారు. బిగ్ బాస్ మేకర్స్ కంటెస్టెంట్స్ ఎంపిక మీద అందుకే అత్యంత శ్రద్ధ వహిస్తారు. సీజన్ 8లో బుల్లితెర, వెండితెర సెలెబ్స్ తో పాటు సోషల్ మీడియా స్టార్స్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. 

46

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ పరువురు సెలబ్స్ తో కూడిన ఒక లిస్ట్ వైరల్ అవుతుంది. తాజాగా ఈ లిస్ట్ లోకి ఓ టాలీవుడ్ హీరో పేరు వచ్చి చేరింది. అతడు ఎవరో కాదు అభినవ్ గోమటం. ఈ నగరానికి ఏమైంది? చిత్రంతో అభినవ్ గోమటం పాప్యులర్ అయ్యాడు. కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించాడు. 

56
Bigg Boss Telugu Season 8

మీకు మాత్రమే చెప్తా చిత్రంలో అభినవ్ గోమటం హీరోకి సమానమైన పాత్ర చేశాడు. అతడు పూర్తి స్థాయి హీరోగా నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి. మస్త్ షేడ్ ఉన్నాయ్ రా, మై డియర్ దొంగ చిత్రాల్లో అభినవ్ హీరోగా నటించారు. ఆయన ప్రధానంగా ఆ చిత్రాలు సాగుతాయి. అభినవ్, ప్రియదర్శి, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలు చేసిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్ భారీ హిట్. 

 

66
Bigg Boss Telugu Season 8

అభినవ్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఈ యంగ్ హీరో అండ్ కమెడియన్ హౌస్లో అడుగుపెడితే రచ్చ రచ్చే అని చెప్పవచ్చు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. మరి చూడాలి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో... కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 8 నుండి ప్రారంభం అయ్యే సూచనలు కలవు. 

Read more Photos on
click me!

Recommended Stories