మెరుగుపడని ఓటింగ్, ఈ వారం ఆ కంటెస్టెంట్ అవుట్?

First Published | Oct 30, 2024, 6:59 PM IST

తొమ్మిదవ వారానికి గాను 5 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఓ కంటెస్టెంట్ రేసులో వెనుకబడింది. సదరు కంటెస్టెంట్ ఓటింగ్ మెరుగు పడలేదు.


ఇక 8వ వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ గతంలో సీజన్ 4లో పాల్గొన్నాడు. పది వారాల పాటు హౌస్లో ఉన్నాడు. ఈసారి తన మార్క్ చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. దాంతో ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. తక్కువ ఓట్లు తెచ్చుకున్న మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. 

అలాగే కమ్యూనిటీ కామెంట్స్ సైతం మెహబూబ్ ని దెబ్బ తీశాయి. మరో కంటెస్టెంట్ నబీల్ తో అతడు కమ్యూనిటీ ఓట్లను ఉద్దేశించి మాట్లాడాడు. మన కమ్యూనిటీ వాళ్ళు మనకు ఓట్లు వేస్తారు. అయితే మనం ఇద్దరం ఒకే వారం నామినేషన్స్ లో ఉండ కూడదు. అప్పుడు ఓట్లు చీలకుండా ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత తీసుకుంటే మనకు ఇబ్బంది ఉండదు. ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండదు, అన్నాడు. ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. మెహబూబ్ మీద వ్యతిరేకత పెరిగింది. 

మెహబూబ్ ఎలిమినేషన్ అనంతరం బిగ్ బాస్ హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. మెగా చీఫ్ గా ఉన్న విష్ణుప్రియకు నామినేషన్స్ నుండి మినహాయింపు దక్కింది. మెగా చీఫ్ కావడంతో విష్ణుప్రియకు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసి జైల్లో పెట్టే అధికారం బిగ్ బాస్ ఇచ్చాడు. 

Latest Videos


వాడి వేడి వాదనల మధ్య నామినేషన్స్ ప్రక్రియ ముగియగా... ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. నయని పావని, గౌతమ్, యష్మి, హరితేజ, టేస్టీ తేజ నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. కాగా ఓటింగ్ లో యష్మి ముందంజలో ఉందట. ఆమెకు అధికంగా ఓట్లు పోల్ అవుతున్నాయట. యష్మికి 35 శాతం ఓట్లు పడ్డాయట. మిగతా నలుగురు కంటెస్టెంట్స్ ఆమెకు పోటీ ఇచ్చే అవకాశం లేదట. 

యష్మి వైల్డ్ కార్డు ఎంట్రీ కాదు. ఆమె ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ఉంది. ఈ అంశం ఆమెకు కలిసొస్తుంది. ఇక రెండో స్థానంలో గౌతమ్ కృష్ణ ఉన్నాడట. అతడికి ఓట్లు పడటానికి మిగతా కంటెస్టెంట్స్ అంత స్ట్రాంగ్ కాకపోవడమే. నిజానికి గౌతమ్ 7వ వారం ఎలిమినేట్ కావాల్సింది. నాగ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ కావడంతో గౌతమ్ కి అవకాశం వచ్చింది. ఆ విధంగా సేవ్ అయ్యాడు. 
 

యష్మి, గౌతమ్ తర్వాత మూడో స్థానంలో టేస్టీ తేజ ఉన్నాడట. ఇతడు మంచి ఎంటర్టైనర్. అది కలిసొచ్చే అంశం. సీజన్ 7లో పాల్గొన్న టేస్టీ తేజ 9 వారాలు హౌస్లో ఉన్నాడు. గత సీజన్లో టేస్టీ తేజ నామినేట్ చేసిన ప్రతి కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యేవారు. అదొక సెంటిమెంట్. 

నాలుగో స్థానంలో నయని పావని ఉందట. ఐదో స్థానంలో హరితేజ ఉన్నారట. వీరిద్దరి మధ్య దాదాపు  5 శాతం ఓటింగ్ వ్యత్యాసం ఉందట. కాబట్టి ఈ వారం హరితేజ ఇంటిని వీడే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇంకా రెండు రోజుల సమయం ఉంది. బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగొచ్చు. హరితేజ ఓట్లు తెచ్చుకుని నయని పావనిని అధిగమించే అవకాశం లేకపోలేదు. 
 

అలాగే ఇది అనధికారిక ఓటింగ్. వివిధ మీడియా సంస్థల సర్వే ఆధారంగా రూపొందించిన సమాచారం. ఒక్కోసారి ఈ అంచనాలు తలకిందులు అవుతూ ఉంటాయి. గతంలో చాలా సార్లు ఇలా జరిగింది. స్టార్ మా అధికారిక ఓటింగ్ అసలు బయట పెట్టదు. షో ఎంటర్టైనింగ్ సాగడం కోసం ప్రేక్షకుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎలిమినేషన్స్ చోటు చేసుకోవచ్చు. 

కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దాదాపు సగం ముగిసింది. ఇప్పటికే కంటెస్టెంట్స్ పై ఆడియన్స్ లో ఒక అభిప్రాయం ఏర్పడింది. టైటిల్ ఫేవరేట్ ఎవరనేది ఇంకా డిసైడ్ కాలేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఒకింత నిఖిల్ ముందంజలో ఉన్నాడు. అతడు టాస్క్ ల పరంగా సత్తా చాటుతున్నాడు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి

click me!