వాడి వేడి వాదనల మధ్య నామినేషన్స్ ప్రక్రియ ముగియగా... ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. నయని పావని, గౌతమ్, యష్మి, హరితేజ, టేస్టీ తేజ నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. ఇక ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు జరుగుతుంది. తమ అభిమాన కంటెస్టెంట్ కి ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. అధికారిక ఓటింగ్ రిజల్ట్స్ స్టార్ మా విడుదల చేయదు. అయితే మెజారిటీ మీడియా సంస్థల పోలింగ్ ఆధారంగా ఒక నిర్ణయానికి రావొచ్చు.
దాదాపు అనధికారిక ఓటింగ్ రిజల్ట్స్ తో ఎలిమినేషన్ మ్యాచ్ అవుతుంది. ఈ అనధికారిక ఓటింగ్ ప్రకారం యష్మి టాప్ లో ట్రెండ్ అవుతుందట. ఆమెకు ఏకంగా 32 శాతం ఓట్లు వరకు పోల్ అవుతున్నాయట. యష్మి ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ఉన్న కంటెస్టెంట్. అది ఆమెకు అడ్వాంటేజ్. సీరియల్ నటిగా బుల్లితెర ప్రేక్షకుల్లో యష్మికి ఫేమ్ ఉంది. గేమ్ పరంగా కూడా పర్లేదు. ఈ క్రమంలో ప్రేక్షకులు ఆమెకు భారీగా ఓట్లు వేస్తున్నారని తెలుస్తుంది.