వీరితో పాటు కిరాక్ సీత, నటుడు నాగమణికంఠ, ఆదిత్య ఓం, నటుడు అభయ్ నవీన్, యాంకర్ విష్ణుప్రియ, యాష్మి గౌడ, ప్రేరణ, సీరియల్ హీరో నిఖిల్,ప్రేరణ, కిరాక్ సీత, బెజవాడ బేబక్క, నటి సోనియా ఆకుల, సీరియల్ యాక్టర్ పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారు.
ఈ సెలెబ్స్ లో సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంది. ఆమె హోస్ట్ నాగార్జునను తన క్యూట్ మాటలు, ఎక్సప్రెషన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేనంటూ హొయలు పోయింది. అమెరికాకు ఏదో అనకాపల్లికి వెళ్లి వచ్చినట్లు వెళతావట? అని నాగార్జున అడిగాడు. అవునని చెప్పింది బెజవాడ బేబక్క.