మరో మూడు వారాల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగియనుంది. ప్రస్తుతం హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో 5 మంది ఫైనల్ కి వెళతారు. మిగిలిన ఐదుగురు ఎలిమినేట్ అవుతారు. తక్కువ సమయం మాత్రమే ఉండగా డబుల్ ఎలిమినేషన్స్, మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ఉండే అవకాశం కలదు.
గత వారం అవినాష్ ఎలిమినేట్ కావాల్సి ఉంది. నబీల్ అతన్ని సేవ్ చేశాడు. నబీల్ వద్ద అవిక్షన్ షీల్డ్ ఉంది. అది ఈ వారం వాడతావా లేక నెక్స్ట్ ఉపయోగిస్తావా? అని నాగార్జున అడిగాడు. అవిక్షన్ షీల్డ్ గెలవడంలో నాకు అవినాష్ చాలా సపోర్ట్ చేశాడు. కాబట్టి నేను అవినాష్ కి అవిక్షన్ షీల్డ్ వాడతాను. బాగా ఆడి ప్రేక్షకుల ఓట్లతో నేను సేవ్ కాగలను అనే నమ్మకం నాకు ఉందని, అన్నాడు.