Bigg Boss telugu 8: నోరు విప్పితే అంతే... బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి స్టార్ మా కఠిన నిబంధన!

First Published | Sep 3, 2024, 6:03 PM IST

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని స్టార్ మా పూర్తిగా లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఓ కొత్త నిబంధన అమలులోకి తెచ్చిందట. దీని ప్రకారం వారు నోరు విప్పే ఛాన్స్ లేకుండా పోయిందట. ఆ మేటర్ ఏమిటో చూద్దాం..
 

బిగ్ బాస్ షోకి వెళ్లాలని చాలా మంది కలలు కంటారు. దీనికి తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా సామాన్యులు హౌస్లో అడుగు పెట్టడం అంత సులభం కాదు. అలాగే ఎంపికైన కంటెస్టెంట్స్ సైతం హౌస్లో మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో కొందరు కంటెస్టెంట్స్ మానసిక, శారీరక అనారోగ్య సమస్యలకు లోనయ్యారు. ఎలిమినేట్ కాకుండానే బయటకు వచ్చేశారు. 

అలాగే కంటెస్టెంట్స్ ని స్టార్ మా ఛానల్ అగ్రిమెంట్ తో లాక్ చేస్తుంది. బిగ్ బాస్ షోకి వెళ్లొచ్చిన సెలబ్రిటీ ఏడాదిపాటు ఇతర ఛానల్స్ లో షోలు చేయ కూడదు. స్టార్ మా ఛానల్ లో మాత్రమే కనిపించాలి. ఒప్పందం చేసుకున్న రెమ్యూనరేషన్ కూడా ఒక్కసారి ఇవ్వరు. వన్ వీక్ రెమ్యూనరేషన్ హౌస్లోకి వెళ్లబోయే ముందే ఇస్తారట. బయటకు వచ్చిన నెల రోజులకు 80% రెమ్యూనరేషన్ చెల్లిస్తారట. మిగతా రెమ్యూనరేషన్ కోసం కనీసం 9 నెలలు వేచి చూడాలట. 


Bigg Boss Telugu 7


కాబట్టి పెండింగ్ రెమ్యూనరేషన్ కోసమైనా... కంటెస్టెంట్స్ అగ్రిమెంట్ కి లోబడి ఉంటారని వారి ప్లాన్ అట. ఎంపికైన కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళుతున్నామని చెప్పకూడదు. బిగ్ బాస్ షోకి ఎలా ఎంపికయ్యారు? ప్రాసెస్ ఏమిటనేది ఎవరితో పంచుకోకూడదు.  సీజన్ 8లో మరో నిబంధన కూడా పెట్టారట. ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ఎలాంటి ఇంటర్వ్యూలలో పాల్గొనకూడదట. 

Nagarjuna bigg boss

ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నుండి ఫినాలే వరకు కంటెస్టెంట్స్ ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వకూడదట. అలాగే ఫినాలే ముగిశాక వారం రోజుల లోపు మీడియా ముందుకు రాకూడదట. కొత్తగా ఈ నిబంధన తెచ్చారని సమాచారం. 


మరోవైపు సీజన్ 8కి గాను ఫస్ట్ వీక్ నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. శేఖర్ బాషా, నాగ మణికంఠ, బెజవాడ బేబక్క, ప్రేరణ, సోనియా ఆకుల, పృథ్విరాజ్ నామినేట్ అయ్యారట. వీరిలో ఒకరు వచ్చే ఆదివారం ఎలిమినేట్ కానున్నారు. ఒక అంచనా ప్రకారం బెజవాడ బెబక్క ఎలిమినేట్ కానుందట. 
 

బెజవాడ బేబక్క వయసు రీత్యా పెద్దవారు. ఏజ్ బార్ లేడీ కంటెస్టెంట్స్ హౌస్లో పెద్దగా రాణించింది లేదు. అలాగే మెజారిటీ సీజన్స్ లో లేడీ కంటెస్టెంట్స్ మొదటి వారం ఎలిమినేట్ అయ్యారు. ఆ సెంటిమెంట్ చూసినా బెజవాడ బెబక్క ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు. 


వీరితో పాటు కిరాక్ సీత, నటుడు నాగమణికంఠ, ఆదిత్య ఓం, నటుడు అభయ్ నవీన్, యాంకర్ విష్ణుప్రియ, యాష్మి గౌడ, ప్రేరణ, సీరియల్ హీరో నిఖిల్,ప్రేరణ, కిరాక్ సీత, బెజవాడ బేబక్క, నటి సోనియా ఆకుల, సీరియల్ యాక్టర్ పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యారు. అయితే పెద్దగా తెలిసిన ముఖాలు లేకపోవడంతో ప్రేక్షకులు ఒకింత నిరాశకు గురయ్యారు. 

Latest Videos

click me!