ఆరో కంటెస్టెంట్ గా వర్మ హీరోయిన్ సోనియా ఆకుల... ఈ తెలుగు అమ్మాయి ఆఫర్స్ కోసం పడ్డ కష్టాలు ఎన్నో!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆరవ కంటెస్టెంట్ గా సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది.   కాంట్రవర్సీ దర్శకుడు వర్మ మూవీలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? 
 

Sonia Akula

సోనియా ఆకుల బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆరో కంటెస్టెంట్. ఆమె కంటే ముందు నటుడు నిఖిల్, యాష్మి గౌడ, ఆదిత్య ఓం, అభయ్ నవీన్, ప్రేరణ ఎంట్రీ ఇచ్చారు. 

Sonia Akula

ఇంతకీ ఎవరీ సోనియా ఆకుల అని పరిశీలిస్తే... తెలుగు అమ్మాయి అయిన సోనియా ఆకుల కొన్ని చిత్రాల్లో నటించింది. పరిశ్రమలో అడుగుపెట్టిన సోనియా ఆకులకు బ్రేక్ రాలేదు. ఆమె అడపాదడపా చిత్రాల్లో నటించింది. ఆఫర్స్ కోసం ఆమె చాలా కష్టాలే పడ్డారు. 


Sonia Akula


సోనియా ఆకుల 2019లో జార్జి రెడ్డి మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. జార్జి రెడ్డి నిజ జీవిత కథగా ఈ చిత్రం తెరకెక్కింది. మస్కన్ కుబ్చాందిని ఈ చిత్ర హీరోయిన్. ఈ చిత్రంలో ఆమె ఓ కీలక రోల్ చేసింది. జార్జి రెడ్డి క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. 

Sonia Akula

అనంతరం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్ మూవీలో నటించింది. 2020లో కరోనా వైరస్ ప్రపంచాన్ని స్తంభింప చేయగా.. ఆ కాన్సెప్ట్ లో దర్శకుడు వర్మ కరోనా వైరస్ టైటిల్ తో మూవీ చేశాడు. ఈ మూవీ పెద్దగా ఆదరణ పొందలేదు. బిగ్ బాస్ షోతో ప్రేక్షకుల్లో ఆదరణ తెచ్చుకోవాలని ఆమె ఆశిస్తున్నారు. 

Sonia Akula

సోనియా ఆకుల గట్టి ఆత్మ విశ్వాసంతో బిగ్ బాస్ షోకి వచ్చింది. కాగా సోనియా ఆకులకు రామ్ గోపాల్ వర్మ శుభాకాంక్షలు తెలియజేశాడు. వర్మ వీడియో బైట్ ని నాగార్జున వేదికపై ప్రదర్శించాడు. బిగ్ బాస్ షోకి రావడం వలన తన కెరీర్ మెరుగు అవుతుందని ఆమె భావిస్తున్నారు. 

సోనియా ఆకుల హౌస్లో సత్తా చాటే సూచనలు కనిపిస్తున్నాయి. సోనియా ఆకుల అనంతరం బెజవాడ బేబక్క, శేఖర్ భాషా ఎంట్రీ ఇచ్చారు. ఈసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారు. 

Latest Videos

click me!