మొదటి వారం నుండి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఢీ కొట్టేందుకు 8 మంది మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా వచ్చారు. హరితేజ, గంగవ్వ, అవినాష్, రోహిణి, మెహబూబ్, నయని పావని, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆల్రెడీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఓజీ క్లాన్ కాగా... వైల్డ్ కార్డ్స్ ని రాయల్ క్లాన్ గా బిగ్ బాస్ నిర్ణయించాడు. ఈ రెండు క్లాన్స్ మధ్య పోటీ జరగనుంది.
సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. గత ఐదు వారాల్లో కంటెస్టెంట్స్ ఆట తీరు ప్రవర్తన ఆధారంగా.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ నామినేట్ చేయాలి. ప్రతి కంటెస్టెంట్ తగు కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేసి వారి మెడలో బోర్డు వేయాలి. మెజారిటీ రాయల్ క్లాన్ సభ్యులు... యష్మి, విష్ణుప్రియలను నామినేట్ చేశారు. పృథ్వి గేమ్ పట్ల కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.