బిగ్ బాస్ హౌస్లో అనూహ్య పరిణామం, గంగవ్వకు గుండెపోటు?

First Published | Oct 22, 2024, 10:23 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గంగవ్వకు గుండెపోటు వచ్చిందట. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. 
 

Bigg boss telugu 8

గంగవ్వ రెండు వారాల క్రితం బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డు ద్వారా ప్రవేశించింది. ఆమెతో పాటు అవినాష్, రోహిణి, హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, మెహబూబ్, గౌతమ్ ఐదు వారాల అనంతరం బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టారు. 
 

Bigg boss telugu 8

గంగవ్వ సీజన్ 4 కంటెస్టెంట్. ఆమె పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన సింపతీ ఉండేది. అందుకే ఆమెకు భారీగా ఓట్లు పోల్ అయ్యేవి. కంటెస్టెంట్స్ సైతం గంగవ్వను నామినేట్ చేసేందుకు ఆసక్తి చూపేవారు కాదు. గంగవ్వను నామినేట్ చేస్తే తాము ప్రేక్షకుల్లో నెగిటివ్ అవుతామని భావించేవారు. 

గంగవ్వ అప్పుడప్పుడు అనారోగ్యంతో ఇబ్బందిపడేవారు. బిగ్ బాస్ హౌస్ ఎయిర్ కండిషనింగ్ కారణంగా చాలా చల్లగా ఉంటుంది. వేళాపాళా లేకుండా నిద్రలేపి టాస్క్స్ ఆడిస్తారు. పల్లెటూరి వాతావరణంలో పుట్టి పెరిగిన గంగవ్వకు బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు సరిపడేవి కావు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నేను గేమ్ ఆడతాను. బిగ్ బాస్ టైటిల్ కొట్టుకుపోతాను. మీరు నాకు సపోర్ట్ చేయండని గంగవ్వ అంటుండేవారు. 
 


ఏడు వారాల అనంతరం గంగవ్వకు అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. డాక్టర్స్ సూచన మేరకు హౌస్ నుండి బయటకు పంపేశారు. ఈ నేపథ్యంలో సీజన్ 8లో గంగవ్వ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుందని వార్తలు రాగా... మెజారిటీ ఆడియన్స్ వ్యతిరేకించారు. గంగవ్వ కారణంగా మిగతా కంటెస్టెంట్స్ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. షోలో మజా ఉండదు. ఆమె మాత్రం వద్దంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. 

అయినప్పటికీ గంగవ్వకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. గంగవ్వకు అర్థరాత్రి గుండెపోటు వచ్చిందన్న వార్త సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. పలువురు బిగ్ బాస్ రివ్యూవర్స్ ఈ విషయం తెలియజేశారు. గంగవ్వకు గుండెపోటు రావడంతో తోటి కంటెస్టెంట్స్ తీవ్ర ఆందోళకు గురయ్యారట. ముఖ్యంగా విష్ణుప్రియ చాలా టెన్షన్ పడిందట. తన వలనే గంగవ్వకు హార్ట్ అటాక్ వచ్చిందని భయపడిందట. 

గంగవ్వకు వైద్యం అందించేందుకు వైద్యుల బృందం బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించారట. ఈ న్యూస్ గంగవ్వ అభిమానుల్లో అలజడికి కారణమైంది. అయితే ఇదంతా ఫ్రాంక్ అంటున్నారు. నిజంగా గంగవ్వకు హార్ట్ అటాక్ రాలేదట. ఆమె నటించారట, బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా గంగవ్వ హార్ట్ అటాక్ వచ్చినట్లు తోటి కంటెస్టెంట్స్ కి ఝలక్ ఇచ్చిందట. 

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ ఘటనపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. బిగ్ బాస్ షో పై వ్యతిరేకత వ్యక్తం కావడం ఖాయం. ఇలాంటి టాస్క్ లు అటు కంటెస్టెంట్స్ తో పాటు అభిమానులు, కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తాయి. సున్నితమైన అంశాల మీద గేమ్స్, టాస్క్స్ సరికాదు. 

Bigg boss telugu 8

ఇదిలా ఉంటే 7వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. అతడికి ప్రేక్షకులు ఓట్లు వేసినప్పటికీ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. నాగ మణికంఠ ఎలిమినేషన్ ఆయన ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేసింది. ఇక 8వ వారం నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మెహబూబ్, ప్రేరణ, విష్ణుప్రియ, నయని పావని, నిఖిల్, పృథ్విరాజ్ నామినేట్ అయ్యారట. వీరిలో ఒకరు వచ్చే వారం బిగ్ బాస్ ఇంటిని వీడనున్నారు. 

గత ఏడు వారాల్లో వరసగా బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, సీత, నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యారు. సీజన్ 7 స్థాయిలో లేటెస్ట్ సీజన్ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఈ వారం పక్కాగా ఇంటికి వెళ్లే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు?

Latest Videos

click me!