బిగ్‌ బాస్‌ తెలుగు 8 సీజన్‌ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లు వీళ్లే, ఫస్ట్ వీక్‌ ఎలిమినేషన్‌లో ఆయనే ఉంటాడేమో!

First Published Sep 2, 2024, 11:51 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ హౌజ్‌లోకి వచ్చిన 14 మందిలో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లు ఎవరో, వీక్ ఎవరో తేలిపోతుంది. ఎలిమినేషన్‌లో ఆయన ముందే ఉంటాడనిపిస్తుంది. 
 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 వ సీజన్‌ ఆదివారం గ్రాండ్‌ గా ప్రారంభమైంది. 14 మందితో ఈ సీజన్‌ స్టార్ట్అయ్యింది. వైల్డ్ కార్డ్ ద్వారా మరికొంత మంది కంటెస్టెంట్లు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరో మినీ ఈవెంట్‌ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఏడు జంటలుగా హౌజ్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లు మొదటి రోజు నుంచే రచ్చ షురూ చేశారు. 

అరుపులతో రచ్చ చేశారు. కిచెన్‌ వద్ద నుంచి ప్రారంభమైన ఈ గోల, గార్డెన్‌ ఏరియాలో, మరోవైపు సిట్టింగ్‌ ఏరియాలోనూ సాగింది. అనంతరం టాస్క్ ల్లోనూ కనిపించింది. అయితే ఈ సీజన్‌లో హౌజ్‌కి కెప్టెన్‌ ఉండటం లేదు. కానీ ముగ్గురు సుప్రీంలు ఉంటారని తెలిపారు. అందుకోసం టాస్క్ ప్రారంభించారు బిగ్‌ బాస్. నిఖిల్‌, నైనికా, యష్మి, శేఖర్‌ బాషా, బెజవాడ బేబక్క, అఫ్రిదీల మధ్య పోటీ పెట్టారు. 
 

మొదటి పోటీలో నిఖిల్‌ విన్నర్‌ అయ్యాడు. మొదటి సుప్రీంగా నిలిచారు. అనంతరం ఇచ్చిన టాస్క్‌ లో నైనిక విన్నర్‌ అయ్యింది. రెండో సుప్రీంగా ఎంపికైంది. చివరగా ఈ ఇద్దరు మిగిలిన నలుగురిలో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇది చాలా హాట్‌ హాట్‌గా సాగింది. అఫ్రిదీ, బేబక్క, శేఖర్‌ బాషాలను ఔట్ చేసి యష్మికి అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారనే దానిపై హాట్‌ హాట్‌గా చర్చ జరిగింది. 

తనకు ఈ అవకాశం రావడం లక్కీగా భావిస్తున్నట్టు తెలపగా, దీన్ని సోనియా వ్యతిరేకించింది. యష్మితో పోల్చితే అఫ్రిది ఏం తక్కువ అంటూ నిఖిల్, నైనికాలను నిలదీసింది. దీంతో వాళ్ల మధ్య గట్టి వాగ్వాదం జరిగింది. చివరకు శేఖర్‌ బాషా కూడా తనని ఎలిమినేట్‌ చేయడానికి కారణం అడిగాడు. మరోవైపు బేబక్క మాత్రం తనని ఔట్‌ చేయడానికి కారణం అడక్కపోవడం ఆశ్చర్యంగా మారింది. అదకాకుండా ఇలాంటివన్నీ వదిలేస్తూ వచ్చాను కాబట్టేఈ స్థాయికి వచ్చానని చెప్పడం గమనార్హం. 
 

Latest Videos


ఇవన్నీ పక్కన పెడితే మొదటి రోజు ఆటని బట్టి, హౌజ్‌లో కంటెస్టెంట్లు వ్యవహరించిన తీరుని బట్టి చూస్తే హౌజ్‌లో ఎవరు యాక్టివ్‌గా ఉన్నారు? ఎవరు డల్‌గా ఉన్నారనేది స్పష్టమవుతుంది. చూడబోతుంటే.. కుర్రాడు నాగ మణికంఠ ఈ సీజన్‌లో రచ్చ చేసేలా ఉన్నాడు.సైలెంట్‌గా అందరితోనూ మాట్లాడుతూ,పాయింట్లు రెయిజ్‌ చేస్తున్నాడు. అలాగే ఇష్యూని రైజ్‌ చేస్తున్నాడు 

మరోవైపు తనని కించపరిచేలా మాట్లాడిన విష్ణు ప్రియాని వ్యతిరేకించాడు. ఈ విషయంలో నిఖిల్‌తోనూ వాగ్వాదం పెట్టుకున్నాడు. చాలా మంది కంటెస్టెంట్లతో మాట్లాడుతూ అందరికి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఇంకోవైపు నిఖిల్‌ ఆట తీరుని, డామినేషన్‌ ని చూస్తుంటే స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా ఉన్నాడు. ఆయనతోపాటు నైనిక కూడా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. 

బెజవాడ బేబక్క ఓపెనింగ్‌లో రచ్చ చేసింది. యూట్యూబ్‌లో రచ్చ చేసింది. కానీ హౌజ్‌లో మాత్రం ఆమె పప్పులు ఉడకటం లేదు. శేఖర్‌ బాషా తన యాసలు, ప్రాసలో నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. సోనియా వాదనలో గట్టిగానే ఉంది. హైలైట్‌ అయ్యింది. కిర్రాక్‌ సీత సందడి చేసే ప్రయత్నం చేసింది. అభయ్‌ నవీన్‌ కొంత ఓకే అనిపించాడు. ఇక మిగిలిన కంటెస్టెంట్లు డల్‌గా కనిపిస్తున్నారు. 
 

ప్రేరణ చాలా డల్‌గా కనిపిస్తుంది. విష్ణు ప్రియా కాస్త హడావుడి చేసినా, ఆమె స్థాయిలో కాదు. అలాగే అఫ్రిదీ ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నా, కంటెంట్‌ ఇచ్చే విషయంలో వెకబడిపోతున్నాడు. పృథ్వీరాజ్‌ కూడా ఏదో ట్రై చేస్తున్నాడు కానీ హైలైట్ కాలేదు. ఇక డల్‌ లో కెళ్ల డల్‌ ఆదిత్య ఓం. ఆయన హౌజ్‌కి పడుకోవడానికా అనేట్టు ఆయన వ్యవహరించారు. 

చూడబోతుంటే వీక్‌ కంటెస్టెంట్‌గా ఉన్నాడు. ఎనిమినేషన్‌ పెడితే ఫస్ట్ వెళ్లిపోయేది ఆయనే అని అర్థమవుతుంది. మొత్తంగా ఫస్ట్ డేనే హౌజ్‌మేట్స్ తామేటో చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఫస్ట్ వీక్‌ ఎలిమినేషన్‌కి సంబంధించిన ప్రక్రియ మంగళవారం ఎపిసోడ్ లో ఉండబోతుంది. 

click me!