శేఖర్ బాషాకు ఊహించని షాక్, ఇంట్లోకి రావద్దన్న భార్య! ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే!

సెకండ్ వీక్ ఎలిమినేటైన శేఖర్ బాషాకు ఊహించని పరిణామం ఎదురైంది. ఇంటికి వెళితే భార్య బయటకు పొమ్మందట. అందుకు కారణం ఏమిటో చూద్దాం. 
 

Shekar Basha

శేఖర్ బాషా అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. ఇంటి సభ్యులు ఆయన్ని స్వయంగా సాగనంపారు. సాధారణంగా ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారు. రెండో వారం ఆ డెసిషన్ కంటెస్టెంట్స్ కే వదిలేశాడు హోస్ట్ నాగార్జున. కంటెస్టెంట్స్ ఆదిత్య ఓం, శేఖర్ బాషాలలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా, ఇంటి సభ్యులు శేఖర్ బాషాను ఎలిమినేట్ చేశారు.

శేఖర్ బాషా భార్యకు డెలివరీ అయ్యింది. ఆమెకు అబ్బాయి పెట్టాడు. ఈ గుడ్ న్యూస్ నాగార్జున నేరుగా శేఖర్ బాషాతో చెప్పాడు. ఈ సమయంలో శేఖర్ బాషా  భార్యతో ఉండటం అవసరం అని భావించిన హౌస్ మేట్స్ బయటకు పంపారు. 

శేఖర్ బాషా ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఓ కీలక విషయం వెల్లడించాడు. తన భార్య కోపంగా ఉందట. ఇంట్లో నుండి బయటకు వెళ్ళమందట. అందుకు కారణం, తక్కువ రోజుల్లోనే ఎలిమినేట్ కావడం అట. 
 


Shekar Basha Bigg Boss8

ఎందుకు వచ్చావు? వెళ్ళిపో? కనీసం టాప్ 5 లో ఉంటావని మేము ఆశించాము. కానీ నువ్వు అప్పుడే ఎలిమినేట్ అయ్యావు. ఎలిమినేషన్ రోజు బాగా ఏడ్చాను. ఫీల్ అయ్యానని, శేఖర్ బాషాతో ఆయన భార్య అందట. అయితే బిడ్డను ఎత్తుకున్న ఆనందం నాకు చాలని శేఖర్ బాషా సంతోషం వ్యక్తం చేశాడు. 

హౌస్లో తనకు నబీల్ బాగా క్లోజ్ అయ్యాడట. ఇద్దరూ ప్రతి విషయం షేర్ చేసుకునేరట. హౌస్లో అందరూ నాన్ వెజిటేరియన్స్ కాగా, తానొక్కడే వెజిటేరియన్ అట. తన కోసం ప్రత్యేకంగా వంట చేయమని అడగలేక పచ్చి కూరగాయలు, క్యారెట్ ముక్కలు తిని కడుపు నింపుకున్న రోజులు కూడా ఉన్నాయట. ప్రోటీన్స్ పౌడర్ ఉండటం ప్లస్ అయ్యిందని, శేఖర్ బాషా చెప్పుకొచ్చాడు. 

Bigg boss telugu 8

రెమ్యునరేషన్ పై కూడా శేఖర్ బాషా పెదవి విప్పాడు. అయితే అసలు విజయం చెప్పకుండా జోక్ చేసి తప్పుకున్నాడు. మీకు రెండు వారాలకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారని అడగ్గా.. మూడు కోట్లు ఇచ్చారు. కాకపోతే అవి బాగా టైట్ గా ఉన్నాయని, పంచ్ పేల్చాడు. 

మరోవైపు మూడవ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ మొదలైంది. విష్ణుప్రియ, అభయ్, నైనిక, ప్రేరణ, పృథ్విరాజ్, నాగ మణికంఠ, సీత, యష్మి నామినేషన్స్ లో ఉన్నారు. విష్ణుప్రియ ఓటింగ్ లో ముందంజలో ఉందట. ఆమెకు అత్యధికంగా ఓట్లు పోల్ అవుతున్నాయట.
 

నాగ మణికంఠ ఓటింగ్ లో రెండో స్థానంలో ఉన్నాడని సమాచారం. నాగ మణికంఠకు పెద్దగా ఫేమ్ లేదు. అయినప్పటికీ ప్రేక్షకులు అతడికి భారీగా ఓట్లు వేస్తున్నారు. అతనిది సింపతీ గేమ్ అంటూ ప్రారంభంలో భారీగా ట్రోల్ చేశారు. ఏదేమైనా అతనికి ఓట్లు పోల్ అవుతున్నాయి. ఇక మూడో స్థానంలో కిరాక్ సీత ఉందట.

 సీరియల్ నటి యష్మి గౌడ స్ట్రాంగ్ ప్లేయర్ గా అవతరిస్తుంది. ముక్కుసూటిగా మాట్లాడుతూ, జెన్యూన్ ప్లేయర్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగిస్తుంది. యష్మి నాలుగో స్థానంలో ఉందట. ఆమె తర్వాత నైనిక ఐదో స్థానంలో ఉన్నట్లు సమాచారం. 

ఆరో స్థానంలో మరో సీరియల్ నటి ప్రేరణ ఉన్నారట.చివరి రెండు స్థానాల్లో పృథ్విరాజ్, అభయ్ నవీన్ ఉన్నారని సమాచారం. అభయ్ కంటే మెరుగైన పొజీషన్ లో పృథ్విరాజ్ ఉన్నాడట. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అభయ్ నవీన్ అంటున్నారు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

Latest Videos

click me!