అనంతరం ఇంటి పనుల విషయంలో డిస్కషన్ వచ్చింది. ఈ రెండు రోజులు శోభ, ప్రియాంకలను వంట చేయమని చెప్పు, మిగతా పనులు మేము చేసుకుంటాం అని అర్జున్ అమర్ తో చెప్పాడు. ఇదే విషయం ప్రియాంక, శోభలకు చెప్పగా వారు మేము చేయము అన్నారు. వాళ్లకు పాత్రలు కడిగే పని ఇచ్చానని అమర్ చెప్పినా వాళ్ళు వినలేదు. చివరికి నువ్వు కెప్టెన్, చెప్పింది చేస్తాం అని ఒప్పుకున్నారు.