Bigg Boss Telugu 7: నేను చేయను అమర్... కెప్టెన్ ని కూరలో కరివేపాకులా తీసేసిన ప్రియాంక, శోభ!

Published : Dec 08, 2023, 06:46 PM ISTUpdated : Dec 08, 2023, 06:55 PM IST

కెప్టెన్ అయినా కూడా అమర్ మాట ఎవరూ వినడం లేదు. చివరికి తన సీరియల్ బ్యాచ్ మేట్స్ కూడా లెక్క చేయడం లేదు. అమర్ చెప్పిన పనిని చేయమని నేరుగా చెప్పేశారు.   

PREV
18
Bigg Boss Telugu 7: నేను చేయను అమర్... కెప్టెన్ ని కూరలో కరివేపాకులా తీసేసిన ప్రియాంక, శోభ!
Bigg Boss Telugu 7


అమర్ దీప్ ఇంత వరకు కెప్టెన్ కాలేదు. పవర్ అస్త్ర, ఫినాలే అస్త్ర, అవిక్షన్ పాస్ గెలుచుకోవడంలో కూడా ఫెయిల్ అయ్యాడు. ప్రస్తుతం హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ కెప్టెన్ కావడం విశేషం. ఫినాలే అస్త్ర విషయంలో పోటీ ఇచ్చి రన్నర్ గా నిలిచిన కారణంగా అమర్ ని నాగార్జున కెప్టెన్ చేశాడు.

28
Bigg Boss Telugu 7

సాధించి తెచ్చుకున్న కెప్టెన్సీ కాదని ఏమో కానీ అమర్ ని ఎవరు లెక్క చేయడం లేదు. నేను కెప్టెన్ నా మాట వినాలని గట్టిగా అరిచినా లాభం లేకుండా పోతుంది. వంట చేయాలని ప్రియాంక, శోభలకు అమర్ చెప్పాడు. మేము చేయమని ముఖాన బద్దలు కొట్టారు. 

 

38
Bigg Boss Telugu 7

ఈ రెండు రోజులు వంట పని ప్రియాంక, శోభలను చేయమను, మిగతా పనులు మేము చేస్తామని అర్జున్ అమర్ తో అన్నాడు. ఇదే విషయం ప్రియాంక, శోభలకు చెప్పాడు అమర్. వాళ్ళు చెప్పింది మేము చేయం. మా శరీరం సహకరించిన దాన్ని బట్టి చేస్తాము అని ప్రియాంక అమర్ అన్నది. 

48
Bigg Boss Telugu 7

కొంచెం అడ్జస్ట్ చేసుకో అని అమర్ బ్రతిమిలాడాడు. మా వల్ల కాదని ఇద్దరు మొండికేశారు. కెప్టెన్ అయినప్పటికీ తన మాట వినడం లేదని అమర్ ఫీల్ అయ్యాడు. వాళ్లిద్దరూ తన ఫ్రెండ్స్, మొదటి నుండి సపోర్ట్ చేస్తున్నవాళ్లు కావడంతో ఏం అనలేకపోయాడు. 
 

58
Bigg Boss Telugu 7


శివాజీ నేరుగా బిగ్ బాస్ తో వాడు కెప్టెన్ ఏంటని అన్నాడు. చూస్తుంటే అమర్ మాట హౌస్లో ఎవరూ వినడం లేదు. ఎవరికి పని చెప్పినా ఎదురు చెబుతున్నారు. కెప్టెన్ గా గౌరవం లేక, బాధ్యతలు నెరవేర్చలేక అమర్ ఇబ్బందిపడిపోతున్నాడు. 

68
Bigg Boss Telugu 7


ఓ టాస్క్ లో అమర్-పల్లవి ప్రశాంత్ మధ్య వాగ్వాదం నడిచింది. అమర్ కొరికాడని ప్రశాంత్ కంప్లైంట్ చేశాడు. నీది డబుల్ గేమ్, నిజ స్వరూపం బయట పెడతా అంటూ అమర్ దీప్ టెంపర్ కోల్పోయాడు. ఈ క్రమంలో నేనంటే అమర్ కి అంత ద్వేషం ఎందుకని ప్రశాంత్ అన్నాడు. అది కోపం కాదురా భయం అన్నాడు శివాజీ.

78
Bigg Boss Telugu 7

కాగా అర్జున్ ఫైనల్ కి వెళ్ళాడు. మిగతా ఆరుగురిలో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. నలుగురు ఫైనల్ కి వెళతారు. ప్రియాంక, శివాజీ, అమర్, ప్రశాంత్ ఫైనల్ కి వెళ్లే అవకాశం కలదు. యావర్, శోభ ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. 
 

88
Bigg Boss Telugu 7

ఇక టైటిల్ రేసు ముగ్గురి మధ్య జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు. శివాజీ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో అమర్ ఉన్నట్లు సమాచారం. ప్రశాంత్ ఖచ్చితంగా టైటిల్ కోసం పోటీపడతాడు. శివాజీ, అమర్ లలో ఎవరు అతడితో తలపడతారు అనేది చూడాలి... 

 

Bigg Boss Telugu 7 Title Winner: టైటిల్ రేసులో ఆ ముగ్గురు... విన్నర్ ఎవరంటే?
 

click me!

Recommended Stories