Bigg Boss Telugu 7 Title Winner: టైటిల్ రేసులో ఆ ముగ్గురు... విన్నర్ ఎవరంటే?

Published : Dec 08, 2023, 04:09 PM ISTUpdated : Dec 08, 2023, 05:20 PM IST

బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. ముగింపు దశకు చేరుకోగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కటెస్టెంట్స్ శక్తివంచన లేకుండా ట్రై చేస్తున్నారు. అయితే టైటిల్ పోరు ఆ ముగ్గురి మధ్యే అని ఓటింగ్ ఆధారంగా తెలుస్తుంది.   

PREV
16
Bigg Boss Telugu 7 Title Winner: టైటిల్ రేసులో ఆ ముగ్గురు... విన్నర్ ఎవరంటే?
Bigg Boss Telugu 7


బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ సక్సెస్. రికార్డు టీఆర్పీ రాబడుతుంది. సీజన్ 6 ఫెయిల్ కావడంతో మేకర్స్ సరికొత్తగా రూపొందించారు. మేకర్స్ ఆలోచనలు సక్సెస్ అయ్యాయి. గేమ్స్, టాస్క్స్, కెప్టెన్సీ టాస్క్స్ లలో కూడా మార్పులు చేశారు. 14 మందితో షో మొదలైంది. 5 వారాల అనంతరం మరో 5గురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. 

26

మొత్తంగా సీజన్ 7లో 19 మంది పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం 14వ వారం నడుస్తుంది. హౌస్లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఐదుగురు ఫైనల్ కి వెళతారు. ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచి ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. మిగిలిన ఆరుగురిలో నలుగురు టాప్ 5 కోసం పోటీపడుతున్నారు.

36

అయితే టైటిల్ రేసు మాత్రం శివాజీ, ప్రశాంత్, అమర్ మధ్యే ఉంటుందని ఓటింగ్ ప్రకారం తెలుస్తుంది. రెండు వారాలకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. అయితే టైటిల్ విన్నర్ కోసం ఓటింగ్ జరుగుతుంది. అనూహ్యంగా పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు. అతడి తర్వాత స్థానంలో శివాజీ ఉన్నాడు. 
 

46
Bigg Boss Telugu 7

మూడో స్థానంలో అమర్ ఉన్నట్లు సమాచారం. అమర్ మెరుగైన ఆట తీరు చూపకపోయినా... గట్టి ఫ్యాన్ బేస్, పీఆర్ టీమ్స్ ఉన్నాయి. ఫినాలే దగ్గిరపడిన నేపథ్యంలో అమర్ కి సపోర్ట్ గా పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ కనిపిస్తున్నాయి. అవి మేజర్ గా అమర్ ని లేపడంతో పాటు ప్రశాంత్, శివాజీలను నెగిటివ్ చేసే పనిలో ఉంటున్నాయి.

56
Bigg Boss Telugu 7

కామనర్ గా హౌస్లో అడుగుపెట్టి అశేష అభిమానులను సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కావడం ఖాయమని తాజా ఓటింగ్ సరళి చూస్తే అర్థం అవుతుంది. ఫినాలేకి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పది రోజుల్లో జరిగే పరిణామాలు కూడా విన్నర్ ని డిసైడ్ చేయవచ్చు. మరి చూడాలి టైటిల్ రైతుబిడ్డ కొడతాడా లేదో.

66
Bigg Boss Telugu 7

రైతుబిడ్డ టైటిల్ కొడితే అది రికార్డు అవుతుంది. గతంలో కామనర్ హోదాలో కొందరు హౌస్లో అడుగుపెట్టారు. టైటిల్ కొట్టలేదు. సీజన్ 6లో ఆదిరెడ్డి నాన్ సెలెబ్రిటీ హోదాలో కంటెస్ట్ చేసి ఫైనల్ కి వెళ్ళాడు. టైటిల్ రేవంత్ గెలిచాడు. రన్నర్ గా శ్రీహాన్ నిలిచాడు. 

 

విసిరికొట్టి బయటకి వెళ్లిపోయిన శివాజీ.. ఆడపిల్లవి అడ్వాంటేజ్ తీసుకోకు, శోభా శెట్టికి సీరియస్ వార్నింగ్

click me!