ఇక, అంతలో అప్పూ మూడు నిమ్మ చెట్లు తీసుకొని వస్తుంది. మూడు తెమ్మన్నావ్ చాలా బరువు అయ్యాయి అని చెబుతుంది. అప్పుడే సరిగ్గా కళ్యాణ్ అక్కడికి వస్తాడు. రావడం రావడమే, మూడు ఎందుకు తెమ్మన్నారు ఆంటీ అని అడుగుతాడు. అయితే, ఎందుకైనా మంచిదని అవసరం అవుతుందని తెమ్మనన్నాను అని చెబుతుంది. కానీ, కనకం దీనిపై ఏదో ఒక ప్లాన్ చేసి ఉండొచ్చు. అది బయటపడకుండా జాగ్రత్తపడుతుంది.
ఇక, మొక్కలు ఇచ్చేసి అప్పూ వెళ్లిపోతుంటే, కళ్యాణ్ ఆపేస్తాడు. తనకు చాలా భయంగా ఉందని, తమ పెళ్లి ఆగిపోతుందేమో అని భయపడతాడు. కానీ, అప్పూ ధైర్యం చెబుతుంది. మీ ప్రేమ నిజం అయితే, మీ పెళ్లి జరుగుతుంది అని ధైర్యం చెప్పి, కళ్యాణ్ వెంటే ఉంటుంది. ఇంతలోనే, అనామికతో పంతులుగారు హోమం పూర్తి చేసి ఇద్దరిచేత నిమ్మ మొక్క నాటిస్తాడు.