Bigg Boss Telugu 7: విన్నర్ ఎవరో తేల్చేసిన ప్రముఖ సర్వే... అతనిదే టైటిల్!

Published : Dec 12, 2023, 09:11 AM ISTUpdated : Dec 12, 2023, 06:30 PM IST

బిగ్ బాస్ తెలుగు 7 చివరి దశకు చేరుకుంది. బిగ్ బాస్ హౌస్లో టాప్ 6 ఉన్నారు. వీరిలో ఒకరు విన్నర్ కానున్నారు. ప్రముఖ సర్వే విన్నర్ ఎవరో తేల్చేసింది..   

PREV
17
 Bigg Boss Telugu 7:  విన్నర్ ఎవరో తేల్చేసిన ప్రముఖ సర్వే... అతనిదే టైటిల్!


ఎక్కడ చూసినా బిగ్ బాస్ షో గురించే చర్చ. షో ముగింపుకు చేరుకోగా విన్నర్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ఈ ఆదివారం శోభ శెట్టి ఎలిమినేట్ అయ్యింది. ఆమె నిష్క్రమణ తో హౌస్లో టాప్ 6 ఉన్నారు. ప్రశాంత్, అమర్, శివాజీ, అర్జున్, యావర్, ప్రియాంక ఫైనల్ కి వెళ్లారు. 
 

27

వీరిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు. పలు మీడియా సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. బిగ్ బాస్ షో అధికారిక ఓటింగ్ ఎవరికీ తెలియదు. ఆ లెక్కలు వాళ్ళు భయటపెట్టరు. సోషల్ మీడియా ట్రెండ్స్, మీడియా సంస్థల సర్వేల ఆధారంగా విన్నర్ ఎవరనేది ప్రేక్షకులు ఒక అంచనాకు వస్తారు. 

37
Bigg Boss Telugu 7


కాగా బాలీవుడ్ కి చెందిన ప్రముఖ మీడియా సంస్థ బిగ్ బాస్ తెలుగు 7 ప్రారంభం అయినప్పటి నుండి సర్వే చేస్తుంది. ప్రేక్షకుల అభిప్రాయాల ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తుంది. లేటెస్ట్ సర్వేలో కొన్ని షాకింగ్ ఫలితాలు వచ్చాయి. 
 

47

డిసెంబర్ 2 నుండి 8 వరకు జరిపిన సర్వే ఫలితాల ప్రకారం శివాజీ టాప్ లో ఉన్నాడు. మొదటి నుండి శివాజీ టైటిల్ రేసులో ఉన్నారు. మైండ్ గేమ్ ఆడుతూ మెచ్యూర్డ్ గా వ్యవహరిస్తూ తన మార్క్ క్రియేట్ చేశాడు. సీనియర్ నటుడిగా శివాజీకి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. రైతుబిడ్డ ప్రశాంత్ కి శివాజీ సపోర్ట్ చేయడం కలిసొచ్చింది..

 

Bigg Boss Telugu 7: టైటిల్ రేసు నుండి అమర్ దీప్ అవుట్... అలా హింట్ ఇచ్చిన నాగార్జున!

57

ఇక రెండో స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. మాట తీరుతో పాటు తన ఆటతో భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రతి టాస్క్ లో వంద శాతం ఇచ్చే పల్లవి ప్రశాంత్ హౌస్ కి మొదటి కెప్టెన్ అయ్యాడు. పవర్ అస్త్ర, అవిక్షన్ పాస్ గెలిచాడు.

67

ఇక మూడో స్థానంలో అమర్ ఉన్నాడు. అమర్ కి చెప్పుకోవడానికి పెద్దగా విజయాలు లేవు. అయితే సీరియల్ హీరోగా అతడికి బుల్లితెర ఆడియన్స్ లో ఇమేజ్, ఫాలోయింగ్ ఉంది. అది అమర్ కి కలిసొచ్చే అంశం. అమర్ కి పలువురు సెలెబ్రిటీలు సపోర్ట్ చేస్తున్నారు. 
 

77
Bigg Boss Telugu 7


ఇక నాలుగో స్థానంలో ప్రియాంక, ఐదో స్థానంలో అర్జున్ ఉన్నారు. వీరికి టాప్ 5 దక్కింది. ఆర్మాక్స్ లేటెస్ట్ సర్వే ప్రకారం శివాజీ విన్నర్.  అయితే కొద్ది రోజులుగా నడుస్తున్న ట్రెండ్ చూస్తే టైటిల్ ప్రశాంత్ కావచ్చు. అతడి తర్వాత స్థానం కోసం అమర్-శివాజీ మధ్య గట్టి పోటీ నడుస్తుంది. ఇక చూడాలి చివరి నిమిషంలో టైటిల్ ఎవరిని వరిస్తుందో... 

శోభ శెట్టి ఫ్యాన్స్ కోసం ఏం చేసిందో తెలుసా... కప్పు కొడితే ఇంకా ఎలాంటి సర్ప్రైజ్ లు ఇచ్చేదో!
 

click me!

Recommended Stories