Bigg Boss Telugu 7: గ్రూప్ రాజకీయాలతో నన్ను ఏకాకిని చేశారు... పోతూ పోతూ బాంబు పేల్చిన అశ్విని!

Published : Nov 26, 2023, 02:11 PM ISTUpdated : Nov 26, 2023, 02:14 PM IST

బిగ్ బాస్ సీజన్ 7లో మరో ఎలిమినేషన్ జరిగింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అశ్విని శ్రీ ఎలిమినేట్ అయ్యింది. ఆదివారం ఆమె వేదిక మీదకు వచ్చింది. నాగార్జున అడిగిన ప్రశ్నకు సమాధానంగా కీలక విషయాలు వెల్లడించింది.   

PREV
16
Bigg Boss Telugu 7: గ్రూప్ రాజకీయాలతో నన్ను ఏకాకిని చేశారు... పోతూ పోతూ బాంబు పేల్చిన అశ్విని!
Bigg Boss Telugu 7

బిగ్ బాస్ హౌస్లో టాప్ 10 కంటెస్టెంట్స్ ఉండగా వారిలో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. అశ్విని శ్రీ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున వెల్లడించారు. 12వ వారానికి ఇంటిని నుండి ఎవరు వెళ్లిపోవాలని జరిగిన నామినేషన్స్ లో అశ్విని ఎవరినీ నామినేట్ చేయకుండా సెల్ఫ్ నామినేట్ అయ్యింది. దానికి భారీ మూల్యం చెల్లించింది. 
 

26
Bigg Boss Telugu 7

ఎలిమినేట్ అయిన అశ్వినిని నాగార్జున వేదిక మీదకు పిలిచారు. వెళ్లే ముందు హౌస్లో ఎవరు హిట్ ఎవరు ప్లాప్ అనేది చెప్పాలని అడిగాడు. పల్లవి ప్రశాంత్ అసలు మాట వినడు సార్ అని చెప్పింది. నువ్వు శివాజీలా మిమిక్రీ చేసి చెబితే వినేస్తాడు... అని నాగార్జున ప్రశాంత్ మీద సెటైర్ వేశాడు. 
 

36
Bigg Boss Telugu 7

యావర్ గురించి మాట్లాడుతూ... అసలు ఊహించలేదు. నాకు ఇంత మంచి ఫ్రెండ్ అయిపోయాడని అశ్విని చెప్పింది. నీతో తెలుగులో మాట్లాడుతున్నట్లు ఉన్నాడు, అని నాగార్జున అశ్వినిని అడిగాడు. అవును సార్ అని ఆమె చెప్పింది. అమ్మాయిలతో మాట్లాడతాడులే అని నాగార్జున యావర్ మీద మరో సెటైర్ వేశాడు. 
 

46
Bigg Boss Telugu 7

ఇక ప్రియాంక ప్లాప్ అని చెప్పింది అశ్విని. మంచి అమ్మాయే కానీ కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంది. నా దృష్టిలో ప్రియాంక ప్లాప్ అని చెప్పింది. అలాగే హౌస్ రెండు గ్రూప్స్ గా విడిపోయిందని అశ్విని ఓపెన్ అయ్యింది. అమర్, ప్రియాంక, శోభ ఒక గ్రూప్... శివాజీ, యావర్, ప్రశాంత్, రతిక మరో గ్రూప్. నన్ను ఏకాకిని చేశారని ఆమె అన్నారు. 
 

56
Bigg Boss Telugu 7

మరి నేను ఆ ఏకాకి గ్రూప్ లో కూడా లేనా అని అర్జున్ అడిగాడు. అందుకు నాగార్జున, అశ్విని నవ్వేశారు. నిన్ను చూస్తేనే అశ్విని భయపడుతుందని నాగార్జున అన్నారు. అయితే హౌస్లో చుక్క బ్యాచ్, మొక్క బ్యాచ్, తొక్కలో బ్యాచ్ అంటూ సటైర్ వేశాడు. అందుకు అందరూ నవ్వేశారు. 
 

66
Bigg Boss Telugu 7

అశ్విని చెప్పిన గ్రూప్స్ గురించి ఆడియన్స్ కి ఇప్పటికే ఓ అవగాహన ఉంది. శనివారం ఎపిసోడ్లో ప్రియాంక, శోభల కన్నింగ్ గేమ్ ని నాగార్జున బయట పెట్టాడు. కెప్టెన్సీ టాస్క్ లో శోభను కాపాడేందుకు యావర్ ని ప్రియాంక ఎలా బలి చేసిందో వీడియో చూపించి మరీ కడిగేశాడు. మొదటి నుండి సీరియల్ బ్యాచ్ ప్రియాంక, అమర్, శోభ ఒక గ్రూప్ గా ఉంటున్నారు. 

 

BB Telugu 7 Top 5: బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీరే... ఆ ఇద్దరి ఎలిమినేషన్ తో ఫైనల్ లిస్ట్ వచ్చేసింది!

Read more Photos on
click me!

Recommended Stories