Bigg Boss Telugu 7: టేస్టీ తేజను చితకబాదిన తోటి కంటెస్టెంట్స్... గుంపుగా దాడి!

Sambi Reddy | Updated : Nov 20 2023, 08:47 AM IST
Google News Follow Us

టేస్టీ తేజాను కంటెస్టెంట్స్ చితకబాదారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆట సందీప్, పూజ మూర్తి, నయని పావని, శుభశ్రీ, దామిని కలిసి దాడి చేశారు. 
 

16
Bigg Boss Telugu 7: టేస్టీ తేజను చితకబాదిన తోటి కంటెస్టెంట్స్... గుంపుగా దాడి!
Bigg Boss Telugu 7


టేస్టీ తేజ బిగ్ బాస్ సీజన్ 7 టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరు. టేస్టీ తేజ తనదైన కామెడీతో ఎంటర్టైన్ చేశాడు. ఇతడు శోభ శెట్టి క్లోజ్ ఫ్రెండ్. వీరిద్దరి మధ్య బాండింగ్ ఆకట్టుకుంది. తేజ 9వ వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. రతిక, తేజ డేంజర్ జోన్లో ఉండగా... రతిక సేవ్ అయింది. తేజ ఎలిమినేట్ అయ్యాడు. 

26
Bigg Boss Telugu 7

కాగా తేజ ఒక అరుదైన రికార్డు నమోదు చేసి పోయాడు. తేజ నామినేట్ చేస్తే ఆ కంటెస్టెంట్ ఇంటికే. ఒక్క సెకండ్ వీక్ మినహాయించి ప్రతివారం తేజ నామినేట్ చేసిన వాళ్ళు ఎలిమినేట్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ మాత్రమే ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని ఎదిరించి నిలిచాడు. 

 

36

కిరణ్ రాథోడ్, దామిని, రతిక, శుభశ్రీ, నయని పావని, పూజ మూర్తి, సందీప్ లను వరుసగా తేజ ఇంటికి పంపాడు. సందీప్ ని అయితే సిల్లీ రీజన్ తో నామినేట్ చేశాడు. ఏడు వరాలు మీరు అసలు నామినేషన్స్ లోనే లేరు. ఒకసారి జనాల్లోకి వెళ్లి వస్తే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది... అందుకే నామినేట్ చేస్తున్నా అన్నాడు. 

Related Articles

46
Bigg Boss Telugu 7

కట్ చేస్తే 8వ వారం సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. బయటకు వచ్చిన సందీప్ తేజ మీద ఫైర్ అయ్యాడు. సిల్లీ రీజన్ తో నామినేట్ చేశాడు. వాడి వలనే ఎలిమినేట్ అయ్యాను అన్నాడు. 9వ వారం తేజ ఎలిమినేట్ కాగా సందీప్ విమర్శల మీద స్పందించాలని మీడియా అడిగారు. ఆయన ఏమన్నారో నాకు ఇంకా తెలియదు. తెలిశాక ఇద్దరం వీడియో చేస్తాం అన్నాడు తేజ. 

56
Bigg Boss Telugu 7

తేజ నామినేట్ చేయడం వలన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కలిసి చితకబాదారు. గుంపుగా దాడి చేశారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. అయితే ఇదంతా ఫన్ కోసం చేసిన వీడియో. దీపావళి పండగ సందర్భంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తేజ, నయని పావన, దామిని, శుభశ్రీ, సందీప్, పూజ మూర్తి ఒకచోట కలిశారు. ఫ్యాన్స్ కి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. 

 

66
Bigg Boss Telugu 7

ప్రస్తుతం హౌస్లో 10 మంది ఉన్నారు. ఆదివారం నో ఎలిమినేషన్ అంటూ నాగార్జున షాక్ ఇచ్చాడు. అశ్విని-గౌతమ్ లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా... యావర్ అవిక్షన్ పాస్ వెనక్కి ఇచ్చేసిన కారణంగా ఈ వారం ఎలిమినేషన్ లేదు. వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ అన్నాడు... 

 

Bigg Boss Telugu 7: ఇదేం ట్విస్ట్.. ఈ వారం తీసేసి వచ్చే వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. లాజిక్‌ లెస్‌.. ?

Recommended Photos