నా చేతుల్లో ఏం లేదు... ప్రియుడితో పెళ్లిపై బిగ్ బాస్ ప్రియాంక ఊహించని కామెంట్స్ 

Published : Dec 23, 2023, 12:09 PM IST

బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ నటుడు శివ కుమార్ ని ప్రేమిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె పెళ్లి పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి.   

PREV
17
నా చేతుల్లో ఏం లేదు... ప్రియుడితో పెళ్లిపై బిగ్ బాస్ ప్రియాంక ఊహించని కామెంట్స్ 
Priyanka Jain

బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ గా ముగిసింది. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. శివాజీ, యావర్, ప్రియాంక, అర్జున్ ఫైనలిస్ట్స్. ఈ సీజన్లో ఫైనల్ కి వెళ్లిన ఓన్లీ లేడీ కంటెస్టెంట్ గా ప్రియాంక జైన్ రికార్డులకు ఎక్కింది. ఫస్ట్ డే నుండి ఆమె హౌస్లో సత్తా చాటింది. 

 

 

Pic Credit: Never endig tales 

27

టాస్క్స్ లో ప్రియాంక అబ్బాయిలతో పోటీపడేది. చాలా గేమ్స్ లో ప్రియాంక గెలిచింది. హౌస్ కెప్టెన్ కూడా అయ్యింది. ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యింది. అయితే శివాజీ, పల్లవి ప్రశాంత్ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నుండి ఆమెకు పోటీ ఎదురైంది. హౌస్లో ప్రియాంక వంటలక్కగా పేరుగాంచింది. 

37


కాగా బిగ్ బాస్ షో వేదికగా ప్రియాంక తన ప్రియుడిని పరిచయం చేసింది. సీరియల్ హీరో శివ కుమార్ ని ప్రేమిస్తున్నట్లు ఆమె వెల్లడించాడు. ఇక ఫ్యామిలీ వీక్లో హౌస్లో అడుగుపెట్టిన శివ కుమార్ కెమెరాల ముందే ప్రియాంకను ముద్దుల్లో ముంచెత్తాడు. టైట్ హగ్స్ తో ఉక్కిరి బిక్కిరి చేశారు. వాళ్ళ రొమాన్స్ చూడలేక తోటి కంటెస్టెంట్స్ సిగ్గుపడి వెళ్లిపోయారు. 

47
Priyanka Jain

 

హౌస్లో శివ కుమార్ తో ప్రియాంక పెళ్లి విషయం పదే పదే ఎత్తింది. హౌస్లోనే పెళ్లి చేసుకుందాం అంది. నువ్వు బయటకు వచ్చాక పెళ్లి చేసుకుందామని శివ కుమార్ హామీ ఇచ్చాడు. 


 

57
Priyanka Jain

 

బయటకు వచ్చిన ప్రియాంక ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఆన్లైన్ చాట్ లో ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఓ అభిమాని శివ కుమార్ తో పెళ్లి ఎప్పుడు? అని అడిగాడు. దానికి ఆమె ఆసక్తికరంగా స్పందించారు. 

67
Priyanka Jain

 

అది శివ కుమార్ నే అడగాలి. నా చేతుల్లో ఏం లేదు. ఆయన ఎప్పుడంటే అప్పుడే పెళ్లి అని చెప్పింది. ఆన్లైన్ చాట్ లో ఆయన కూడా జాయిన్ అవ్వొచ్చుగా అని మరొకరు అడిగారు. శివ కుమార్ షూటింగ్ లో బిజీగా ఉన్నారని ప్రియాంక చెప్పింది. 

 

77

మౌనరాగం సీరియల్ లో శివ కుమార్-ప్రియాంక జంటగా నటించారు. ఆ సీరియల్ సెట్స్ లో ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లుగా వీరి మధ్య రిలేషన్ నడుస్తుంది. ప్రియాంక బిగ్ బాస్ అనంతరం మొదటి ఇంటర్వ్యూ శివ కుమార్ ఛానల్ కి ఇచ్చింది. శివ కుమార్ స్వయంగా కొన్ని ప్రశ్నలు అడిగాడు... 

click me!

Recommended Stories