BrahmaMudi Serial 23 December:స్వప్న కోసం కావ్యతో చేతులు కలిపిన పద్దూ, అవమాన భారంలో అప్పూ..!

Published : Dec 23, 2023, 09:56 AM IST

మరో ఆడపిల్ల జీవితం నాశనం చేయాలనే బుద్ధి లేదు అని, మీరు ఆ విషయంలో కంగారుపడాల్సిన అవసరం లేదని, మీ అమ్మాయి జీవితానికి మా అప్పూ ఎప్పటికీ అడ్డు రాదు చెబుతుంది. తర్వాత  అప్పూని కనకం అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోతుంది.  

PREV
19
BrahmaMudi Serial 23 December:స్వప్న కోసం కావ్యతో చేతులు కలిపిన పద్దూ, అవమాన భారంలో అప్పూ..!
Brahmamudi

BrahmaMudi Serial 23 December: కళ్యాణ్ హల్దీ వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. అయితే, కళ్యాన్ తో అప్పూ క్లోజ్ గా ఉంది అంటూ అనామిక తల్లిదండ్రులు తప్పుపడతారు. అప్పూని పక్కకు పిలిచి మరీ తిడతారు. మధ్యలో కనకం దూరి మీరు తప్పుగా అనుకుంటున్నారు.. అలాంటిదేమీ లేదని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ, అనామిక తల్లి శైలజ మాత్రం చాలా ఘోరంగా మాట్లాడుతుంది. మీరు మీ కూతుళ్లను ఈ ఇంటి కోడలిని చేయడానికి ఎన్ని కుట్రలు చేశారో మాకు తెలుసు అంటుంది. వెంటనే అనామిక తండ్రి సైతం.. మీరు ఎన్ని వేషాలు వేసినా చూస్తూ ఊరుకోవడానికి మేం రాజ్ అంత మంచి మనుషులం కాదు అని, తమ అల్లుడికి దూరంగా ఉండమని హెచ్చరిస్తారు. నా కూతురి జీవితం నాశనం చేసి, మీ కూతురిని కళ్యాణ్ కి కట్టపెట్టాలని చూస్తున్నారా? కూతుళ్లను డబ్బుున్న వాళ్లకు  ఎర వేయడం బాగా ఫ్యాషన్ అయిపోయింది అని అనామిక తండ్రి అంటాడు. ఆ మాటకు అప్పూకి విపరీతంగా కోపం వస్తుంది. వెంటనే వెళ్లి, అనామిక తండ్రి చొక్కా పట్టుకుంటుంది.  మా అమ్మని అంత మాట అంటావా అని సీరియస్ అవుతుంది. ఇక్కడ చీల్చి బొంద పెడతా అని అంటుంది. కానీ, మూర్తి అప్పూని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే, అప్పూ మాత్రం.. తనని ఎన్ని మాటలు అన్నా భరిస్తాను కానీ, నా తల్లిని అంటే ఊరుకోను అని అంటుంది. కళ్యాణ్ కాబోయే అత్తమామలని,వదిలేయమని కనకం కోరుతుంది. కానీ, అప్పూ వినదు. దీంతో, మూర్తికి విపరీతంగా కోపం వస్తుంది. 
 

29
Brahmamudi

అప్పూని పక్కకు లాగి కొట్టబోతాడు. ఎప్పూ ఏమీ అనని తండ్రి తనమీద చెయ్యి ఎత్తడంతో అప్పూ సైలెంట్ అయిపోతుంది. తర్వాత.. మూర్తి అప్పూని తిడతాడు.  తర్వాత అనామిక పేరెంట్స్ కి క్షమాపణలు చెబుతాడు.  అది అప్పూకి నచ్చదు. మీరెందుకు క్షమాపణలు చెప్పాలి అంటే.. నువ్వు ఇంకో మాట మాట్లాడితే నా మీద ఒట్టు అని మూర్తి అంటాడు. దీంతో అప్పూ ఆగిపోతుంది. తర్వాత కనకం.. తన కూతురికి ఆవేశం ఎక్కువే కానీ, మరో ఆడపిల్ల జీవితం నాశనం చేయాలనే బుద్ధి లేదు అని, మీరు ఆ విషయంలో కంగారుపడాల్సిన అవసరం లేదని, మీ అమ్మాయి జీవితానికి మా అప్పూ ఎప్పటికీ అడ్డు రాదు చెబుతుంది. తర్వాత  అప్పూని కనకం అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోతుంది.
 

39
Brahmamudi

అప్పూ.. అలా కాలర్ పట్టుకున్నా ఎందుకు వదిలేశావ్ అని శైలజ అంటుంది. వదలకుండా రచ్చ చేస్తే, పెళ్లి ఆగిపోతుందని, అసలే మనకు చాలా అప్పులు ఉన్నాయని అనామిక తండ్రి అంటాడు. సైలెంట్ గా ఉండమని భార్యను అక్కడి నుంచి తీసుకొని వెళతాడు. మరోవైపు అరుణ్ కోసం స్వప్న, కావ్య వెతుకుతూ ఉంటారు. కానీ, అరుణ్ వాళ్లకు కనిపించకుండా తప్పించుకుంటాడు. దీంతో, స్వప్న బయపడుతుంది. వాడు ఇక్కడిదాకా వచ్చేశాడని, కచ్చితంగా అందరి ముందు రచ్చ చేసి, తన కడుపులో బిడ్డకు తండ్రి తానేనని చెప్పుకుంటాడు అని అనేస్తూ ఉంటుంది.
 

49
Brahmamudi

అయితే కావ్య, వాడు కాదు  ముందు నువ్వే అందరి ముందు చెప్పేసేలా ఉన్నావ్ అని కావ్య అంటుుంది. దీంతో స్వప్న... నీ వల్లే వాడు ఇక్కడికి వచ్చాడు. నేనే వెళ్లి దాక్కుంటాను అంటే నువ్వు ఒప్పుకోలేదు, వాడిని పట్టుకోవచ్చు అన్నావ్, నన్ను ఇరికించేశావ్ అని అంటుంది.

59
Brahmamudi

కావ్య వెంటనే నేను ఎందుకు ఇరికాస్తాను అక్క, వాడిని వెతికి పట్టుకుందాం అని అంటుంది. మన ప్లాన్ తెలిశాక వాడు మనకు దొరకడు కదా అని స్వప్న అంటే, పద్దూ వచ్చి.. నేను సహాయం చేస్తాను అంటుంది. వాడు రిసార్ట్ లో ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాను అని భరోసా ఇస్తుంది.

69
Brahmamudi

మరోవైపు అరుణ్ వెళ్లి రాహుల్, రుద్రాణిలకు కనపడతాడు. తాను స్వప్నకు కనిపించానని చెబుతాడు. ఇంకెవరైనా చూశారా అంటే, కావ్య చూసిందని చెబితే తిడతారని  మనసులో అనుకొని, స్వప్న మాత్రమే చూసిందని చెబుతాడు. అయితే, వెళ్లి ఎవరికీ కనిపించకుండా దాక్కోమని, తాను చెప్పినప్పుడు వచ్చి స్వప్న బిడ్డకు తండ్రి నువ్వే అని చెప్పాలని, అప్పుడు నేను రచ్చ చేసి పెళ్లి ఆపేలా చేస్తాను  అని  రుద్రాణి అంటుంది. వీరి ప్లాన్ గురించి నువ్వు, నేను, ప్రేమ సీరియల్ విలన్ మురళికి తెలుస్తుంది. వాళ్లతో ఇతను కూడా చేతులు కలుపుతాడు.
 

79
Brahmamudi

ఇదిలా ఉండగా, అప్పూ పై చెయ్యి ఎత్తినందుకు మూర్తి  కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ‘ఈ చేతితో నా కూతురిని కొట్టబోయాను. తన గుండెల్లో ఉన్న బాధ ఏంటో తెలిసి కూడా కొట్టబోయాను.నేను అసలు మనిషినే కాదు’ అని బాధపడతాడు. ‘ఊరుకోయ్య, నువ్వు కావాలని చెయ్యలేదు కదా, అప్పూ ఎక్కడ తప్పు  చేయాల్సి వస్తుందో అని , ఈ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అనే భయంతో నువ్వు అలా చేశావ్’ అని కనకం సర్ది చెబుతుంది. ‘ మనకు కారణాలు ఉండొచ్చు కనకం, కానీ అప్పూని అయితే బాధపెట్టాను కదా’ అని మూర్తి  బాధపడుతూ ఉంటే.. ‘ అప్పూకి నువ్వుంటే ప్రాణం.. నీ మీద ఎప్పటికీ కోపం తెచ్చకోదు’అని అంటుంది. కానీ.. కూతురి మనసులో ఏముందో తెలిసి కూడా ఆ బాధను తీర్చలేకపోతుున్నాం కదా అని మూర్తి అంటాడు. ఈ పెళ్లి తర్వాత అప్పూని వేరే ప్రాంతానికి తీసుకొని వెళదాం అని, అప్పుడు ప్లేస్ మారితో మనసులో బాధ తగ్గుతుందని కనకం ఐడియా ఇస్తుంది. అప్పూ వస్తుంది అంటావా అని మూర్తి అంటే, తన కోసం రాకపోయినా, కళ్యాణ్ సంతోషంగా ఉంటాడు అంటే వస్తుంది అని కనకం అంటుంది.
 

అసలు అనామిక తల్లిదండ్రులకు మన అమ్మాయి మీద ఎందుకు అనుమానం వచ్చింది అని మూర్తి అడుగుతాడు. కళ్యాణ్ ప్రతిదానికీ మన అమ్మాయి పక్కనే ఉండాలి అని ఆశపడుతున్నాడు కదా, అది వాళ్లకు నచ్చడం లేదు, ఇందాక అప్పూ చొక్కా పట్టుకోవడంతో అందరినీ పిలిచి అల్లరి చేస్తారని భయపడ్డాను అని కనకం అంటుంది. దుగ్గిరాల ఇంటికి కోడలిని చేసే అవకాశం వస్తే, ఎవరు మాత్రం కాదనుకుంటారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు గొడవ పడి నవ్వుల పాలు అవ్వాలని అనుకోరు కదా, అలా గొడవపడే వారు కాదు కాబట్టే, అప్పూూని పక్కకు పిలిచి చెప్పారు. అని మూర్తి అంటాడు. అప్పూ కారణంగా ఈ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందేమో అని చాలా భయమేసిందని , ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి జరగాలని కనకం దేవుడిని కోరుకుంటుంది.
 

89
Brahmamudi

మరోవైపు అప్పూ కళ్యాణ్ ని ప్రేమించిందనే విషయాన్ని అప్పూ ఫ్రెండ్ ఓకుర్రాడు కళ్యాణ్  కి చెప్పాలని అనుకుంటాడు. కళ్యాణ్ ఫోటో వెనక  అప్పూ రాసుకున్న ప్రేమను చూస్తాడు. ఆ ఫోటోతో పెళ్లి మండపానికి బయలుదేరతాడు. ఇక మరో వైపు పద్మావతిని విక్రమ్ ఆదిత్య.. అందంగా రెడీ అవ్వమని చెబుతాడు. తనకు రాదు అని పద్దూ అంటే.. విక్రమ్ రెడీ చేస్తాడు. మరో వైపు కావ్య కూడా చీర కట్టుకోవడానికి రెడీఅవ్వాలని చూస్తుంది. గదిలో రాజ్ ఉన్నాడని ఆలోచిస్తూ ఉంటుంది. తన ముందే మార్చుకోమని అంటాడు. రాజ్ అటువైపు తిరిగితే.. కావ్య ఇటు తిరిగి చీర కట్టుకుంటుంది. రాజ్ ఫోన్ చూసుకుంటూ.. పొరపాటున అద్దంలో నుంచి చూసేస్తాడు. అలా చూసిన తర్వాత కంట్రోల్ చేసుకోవడం రాజ్ వల్ల కాదు. భయంతో బయటకు పరుగులు తీయబోతాడు. కానీ కావ్య ఆపేస్తుంది. డైలాగులు కొడుతుంది. తప్పించుకొని రాజ్ బయటకు పరుగులు తీస్తాడు. అటు నుంచి విక్కీ కూడా అదే టైమ్ కి బయటకు వస్తాడు. ఇద్దరూ భార్యలు చీరలు మార్చుకుంటున్నారనే విషయం వారికి అర్థమౌతుంది.తర్వాత, ఇద్దరూ చక్కగా రెడీ అయ్యి బయటకు వస్తారు. వాళ్ల అందాలు చూసి వీళ్లిద్దరూ మైమరిచిపోతారు. ఇక్కడ వీళ్లు.. మెహందీ పంక్షన్ కోసం రెడీ అవ్వడం విశేషం. 
 

99
Brahmamudi

మరోవైపు అప్పూ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. మెహందీకి రెడీ అవ్వమని అప్పూకి కనకం చెబుతుంది. అప్పూ తాను రాను అంటుంది. తాను  మగరాయుడిలా ఉంటానని, ఆ మెహందీ ఫంక్షన్  తనకు సెట్ అవ్వదు అని చెబుతుంది. చూడటానికి మగరాయుడిలా ఉన్నా, నవ్వు ఆడపిల్లవే అని కనకం గుర్తు చేస్తుంది. అప్పూ మాత్రం కళ్యాణ్ ఏరోజు తనను ఆడపిల్లలా చూడలేదని, మగ రాయుడిలానే చూశాడని, ఇక ఎక్కడి నుంచి తనకు ఆడపిల్ల అనే ఫీలింగ్ వస్తుంది అని అడుగుతుంది. అప్పూ బాధ విని.. కనకం కౌగిలించుకొని ఓదారుస్తుంది. తన తలరాత  సరిగా లేదని అప్పూ అంటుంది. గతంలో ఒకసారి కళ్యాణ్ కోసం చీర కట్టుకుంటే ఏం జరిగిందో గుర్తులేదా.. అన్ని విషయాల్లో తనను సపోర్ట్ చేస్తాడని, చీర కట్టుకుంటే మాత్రం నవ్వేస్తాడని.. తాను మెహందీకి రాను అని చెప్పి కనకం వాళ్లను పంపించేస్తుంది. మూర్తి కూడా అప్పూ బాధ తగ్గాలంటే ఇక్కడే ఉండాలని చెప్పి, కనకం ని తీసుకొని వెళతాడు. మెహందీ ఫంక్షన్ హడావిడి రేపటి ఎపిసోడ్ లో సాగనుంది.
 

click me!

Recommended Stories