Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ రేర్ ఫీట్... అక్కడ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ తో పోటీపడుతున్న రైతుబిడ్డ!

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సంచలనాలు కొనసాగుతున్నాయి. టైటిల్ ఫేవరేట్స్ లో ఒకడిగా ఉన్న ప్రశాంత్ ఫేమ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. కాగా ఈ కామనర్ ఏకంగా సుధీర్, హైపర్ ఆదిలకు కూడా సవాల్ విసురుతున్నాడు. 
 

bigg boss telugu 7 contestant pallavi prashanth rare feat challenges sudigali sudheer and hyper aadi ksr
Bigg Boss Telugu 7

పల్లవి ప్రశాంత్ ఒక సామాన్య రైతుబిడ్డ. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఇతడికి బిగ్ బాస్ అంటే పిచ్చి. ప్రతి సీజన్ చూసేవాడు. తాను కూడా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. ప్రయత్నం చేసి ఎట్టకేలకు- సక్సెస్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7లో ఛాన్స్ దక్కించుకున్నాడు. 
 


పల్లవి ప్రశాంత్ పెద్దగా ఎవరికీ తెలియదు. సోషల్ మీడియా జనాలకు కూడా అంతంత మాత్రమే. దీంతో అతడిపై ఎలాంటి అంచనాలు లేవు. రెండు మూడు వారాలు ఉండటమే కష్టం అనుకున్నారు. అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ... ప్రశాంత్ టైటిల్ ఫేవరేట్ అయ్యాడు. 
 


పల్లవి ప్రశాంత్ కేవలం సింపతీ గేమ్ ఆడుతున్నాడు. అది అతనికి కలిసొస్తుందని నిరూపించే ప్రయత్నం జరిగింది. అమర్ దీప్, రతికతో పాటు మరికొందరు హౌస్ మేట్స్ ఇదే కోణంలో అతన్ని టార్గెట్ చేశారు. అది వాళ్ళకే మైనస్ అయ్యింది. అదే సమయంలో తనను విమర్శించిన వాళ్లకు సవాల్ విసిరాడు. 
 

పల్లవి ప్రశాంత్ నాలుగో పవర్ అస్త్ర గెలుచుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు. మైండ్ గేమ్స్, ఫిజికల్ టాస్క్ లలో అంచనాలకు మించి రాణిస్తున్నాడు. పల్లవి ప్రశాంత్ మీద పడి ఏడ్చే అమర్ దీప్ కి ఇంత వరకు ఒక్క అచీవ్మెంట్ లేదు. ఫ్రస్ట్రేషన్ తప్పితే సత్తా చాటింది లేదు.

కాగా పల్లవి ప్రశాంత్ క్రేజ్ జనాల్లో ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు తాజా సర్వే తెలియజేసింది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సర్వే ప్రకారం టాప్ బుల్లితెర స్టార్స్ తో పల్లవి ప్రశాంత్ పోటీపడుతున్నారు. అక్టోబర్ 23 వరకు అత్యంత పాప్యులర్ మేల్ బుల్లితెర స్టార్స్ నాన్ ఫిక్షన్ విభాగంలో రిజల్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. టాప్ 5లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. 
 

Bigg Boss Telugu 7


ఈ సర్వే ప్రకారం హైపర్ ఆది టాప్ లో ఉన్నాడు. అతని తర్వాత సెకండ్ ప్లేస్ లో సుడిగాలి సుధీర్ ఉన్నాడు. ఇక మూడో స్థానంలో జబర్దస్త్ కమెడియన్ సునామీ సుధాకర్ ఉన్నాడు. నాలుగో స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. ఐదవ స్థానంలో శేఖర్ మాస్టర్ ఉన్నారు. 

Bigg Boss Telugu 7

టాప్ 5 మేల్ బుల్లితెర స్టార్స్ లో బిగ్ బాస్ సీజన్ 7 నుండి ఒక్క పల్లవి ప్రశాంత్ కి మాత్రమే చోటు దక్కింది. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ లో కూడా పల్లవి ప్రశాంత్ కి చోటు దక్కింది. శివాజీ, ప్రశాంత్, అమర్, గౌతమ్, యావర్ వరుసగా టాప్ 5లో ఉన్నారు. 

రాహుల్ సిప్లిగంజ్ తో రతిక ప్రేమాయణం బయటపెట్టిన సింగర్ దామిని... వాడుకున్నాడని సంచలన ఆరోపణలు!
 

Latest Videos

click me!