మొదటి నుండి అమర్ కి పల్లవి ప్రశాంత్ అంటే గిట్టదు. తన ప్రతి నామినేషన్ లో ప్రశాంత్ ఉంటాడు. ప్రారంభంలోనే పల్లవి ప్రశాంత్ పై అమర్ దాడి షురూ చేశాడు. రైతుబిడ్డ అనే ట్యాగ్ పోగొట్టాలని, అతడు సింపథీ వలనే హౌస్లో ఉంటున్నాడని నిరూపించే ప్రయత్నం చేశాడు. రైతులే కాదు ఇంజినీర్లు, డ్రైవర్లు కూడా గొప్పోళ్లే అని భారీ డైలాగ్ కొట్టాడు.