BhramaMudi Serial Today: అనామికతోనే కళ్యాణ్ పెళ్లి జరగాలన్న అప్పూ, మారని కనకం తీరు..!

First Published Dec 7, 2023, 10:22 AM IST

సీతారామ్య, దోషానికి పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు. ఆయన ఆలోచిస్తుంటే, కనకం పాయిజన్ బాటిల్ చూపించి మళ్లీ బెదిరిస్తుంది. సీతారామయ్య మరీ  ఒత్తిడి చేయడంతో హోమం చేయాలి అని అంటాడు. హోమం చేస్తే, కాస్త ఉపశమనం కలుగుతుందని చెబుతాడు.

Brahmamudi


BhramaMudi Serial Today: దుగ్గిరాల ఇంట్లో  కళ్యాణ్ నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తారు. అయితే, అప్పటికే పంతులు గారిని కనకం బెదిరించడంతో, ఏ కారణం చెప్పి పెళ్లి ఆపాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. చెప్పలేక చెప్పలేక నసుగుతూ ఉంటాడు. దాంతో, ఇంట్లోవాళ్లు ఏమైంది పంతులుగారు చెప్పండి అంటూ ఒత్తిడి చేస్తారు. దీంతో, అబ్బాయి జాతకం దివ్యంగా ఉంది కానీ, అమ్మాయి జాతకంలో మాంగళ్య దోషం ఉంది అని చెబుతాడు. దీంతో, ఇంట్లోవాళ్లంతా షాకౌతారు. కనకం కూడా తనకు ఏమీ తెలియనట్లు నోరెళ్లపెడుతుంది. ఆ దోషం ఉంటే ఏం జరుగుతుంది అని చిట్టి అడుగుతుంది. అయితే, ఏం చెప్పాలో తెలియక తికమక పడుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే కనకం మాంగళ్య దోషం చాలా పెద్దది అయ్యి ఉంటుంది కదా పంతులు గారు అని అంటుంది. వెంటనే పంతులు అందుకొని, ‘నిజమేనమ్మా, మాంగళ్య దోషం అంటే చాలా పెద్దదే. వారిద్దరికీ పెళ్లి జరిగితే, ఇంట్లో పెద్దవాలకు కీడు జరగొచ్చు. ఆ జంట కాపురం కూడా సవ్యంగా జరగదు’ అని అంటాడు.

Brahmamudi

పాపం నిజమని నమ్మిన ధాన్యలక్ష్మి ‘ మీరు అంటుంటే నిజమే అనిపిస్తోంది పంతులుగారు. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి మా మామయ్య గారికి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. పెళ్లి కూడా వాయిదా పడుతూ వస్తుంది’ అని అంటుంది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదని కనకం హ్యాపీగా ఫీలౌతుంది. కానీ, సీతారామయ్య ఒప్పుకోడు. ఒక ఆడపిల్ల జాతకం పట్టుకొని  ఇలా అనడం మంచిది కాదని, వాళ్లంతా బాధపడుతున్నారని అంటాడు. అనామిక కూడా  ఏడుస్తుంది. అయితే, కనకం కూడా అనామికను చూసి తప్పు చేశానా అని ఫీలౌతుంది. కానీ, తన కూతురి కోసం తప్పదు అనుకుంటుంది.

Latest Videos


Brahmamudi

వెంటనే, సీతారామ్య, దోషానికి పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు. ఆయన ఆలోచిస్తుంటే, కనకం పాయిజన్ బాటిల్ చూపించి మళ్లీ బెదిరిస్తుంది. సీతారామయ్య మరీ  ఒత్తిడి చేయడంతో హోమం చేయాలి అని అంటాడు. హోమం చేస్తే, కాస్త ఉపశమనం కలుగుతుందని చెబుతాడు. అది మాత్రమే కాదని, నిమ్మ మొక్క తెచ్చి పెరట్లో నాటాలని, అది మరుసటి రోజుకి పచ్చగా ఉండాలని, అలా లేకుండా మొక్క చనిపోతే, పెళ్లి ఆపాల్సిందే అని  పంతులుగారు చెబుతారు. అలా కాదని పెళ్లి చేసుకున్నా, ఆ జంట కలిసి ఉండరని విడిపోతారని చెబుతాడు. ఇలాంటి పరిహారం చెప్పాడు ఏంటి అని కనకం తిట్టుకుంటుంది.

Brahmamudi

అయితే, కళ్యాణ్ ఫీలౌతూ ఉంటే, ఇంట్లో అందరూ ధైర్యం చెబుతారు. అనామిక ఏదో చెప్పబోతుంటే, మన ప్రేమ నిజమైతే, ఆ మొక్క బతుకుతుందని కళ్యాణ్ చెబుతాడు. వారి ప్రేమ నిజమౌతుందని, వారి పెళ్లి జరుగుతుంది అని సీతారమయ్య కూడా అంటాడు.

Brahmamudi


ఆ తర్వాత.. ఇంటికి వెళ్తున్న పంతులుగారిని ఆపి, కనకం తిడుతుంది. ‘ఈ నిశ్చితార్థం పూర్తిగా ఆపేయమంటే, పరిహారం ఎందుకు చెప్పారు’ అని కనకం అడుగుతుంది. ‘ నేను పరిహారం చెప్పకుంటే, మరో పంతులని పిలచేవారని, అలా పిలిస్తే, వాళ్లు నీకు భయపడకపోతే, ఆయన వచ్చి, వాళ్లిద్దరి జాతకంలో ఎలాంటి దోషాలు లేవని, దివ్యంగా ఉంది అని చెబితే ఏం చేస్తారు. మీ పథకం కూడా బయటపడుతుంది’అని అంటాడు. అయితే, మరో ఏదైనా సలహా ఇవ్వమని అడుగుతుంది. తన వళ్ల కాదు అని పంతులు చెప్పినా, కనకం వదలదు. దీంతో, నాటిన నిమ్మ చెట్టును  చచ్చిపోయేలా చేస్తే ఆ వంక చూపించి పెళ్లి ఆపేస్తాను అని పంతులు అంటాడు.

Brahmamudi

అలా పంతులు వెళ్లగానే, ఇలా అప్పూ వస్తుంది. నిశ్చితార్థం ఆగిపోవడంపై అప్పూ నిర్ణయం అడుగుతుంది. అయితే, అప్పూ అవన్నీ నమ్మదు. అయితే, కనకం మాత్రం తనకు కళ్యాణ్ తో అనామిక పెళ్లి జరగదని అనిపిస్తోందని, అప్పుడు నీతో కళ్యాణ్ పెళ్లి జరుగుతుందేమో అంటుంది. కానీ, అప్పూ మాత్రం అలా చేయడం తప్పు అని. జాతకం పేరుతో కళ్యాణ్, అనామికల పెళ్లి ఆపడం తప్పని, తాను వాళ్ల పెళ్లి జరగాలనే కోరుకుంటున్నాను అంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోతుంటే, నిమ్మ మొక్కలు తీసుకొని రమ్మని చెబుతుంది. అప్పూ వెళ్లిన తర్వాత ఎలాగైనా పెళ్లి ఆపాల్సిందేనని కనకం డిసైడ్ అవుతుంది.

Brahmamudi

మరోవైపు కావ్య బెడ్రూమ్ లో ఏదో పుస్తకం పట్టుకొని చూస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావ్ అని రాజ్ అడిగితే, మన జాతకాలు చూస్తున్నాను అని చెబుతుంది. సడెన్ గా ఎందుకు జాతకాలు చూస్తున్నావ్ అంటే, మన పెళ్లి అప్పుడు జాతకాలు చూడలేదు కదా అందుకే చూస్తున్నాను అంటుంది. అయితే, అది కూడా సింపుల్ గా చెప్పదు. ఏవేవో ఎప్పటిలాగానే భారీ డైలాగుుల చెబుతుంది. మనం పిల్లి, ఎలుకల్లా కొట్టుకుంటున్నాం కదా, అందుకే ఏదైనా దోషం ఉందేమో అని చూస్తున్నాను అని  కావ్య అంటే, దోషం మొత్తం నీలోనే ఉంది అంటాడు. దానికి కూడా చాంతాడంతా డైలాగులు చెబుతుంది. రాజ్ కూడా కావ్య తగ్గట్టు డైలాగులు చెబుతాడు. ఇద్దరూ ఎప్పటిలాగానే టామ్ అండ్ జెర్రీ వార్ చేసుకుంటారు.

Brahmamudi

మరోవైపు ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. పంతులు చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు కనకం ఎంట్రీ ఇచ్చి, ధాన్యలక్ష్మి మరికాస్త అనుమానం పెంచేలా మాట్లాడుతుంది. పంతులుగారు చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నారు కదా అంటే, ధాన్యలక్ష్మి అవును అంటుంది. కొడుకు జీవితం కదా ఆ మాత్రం భయం ఉంటుందిలే అని కనకం అంటుంది. అయితే, ఇవన్నీ నిజంగా నిజమౌతాయా అని ధాన్యలక్ష్మి సందేహం వ్యక్తం చేస్తుంది. అయితే, కనకం ఇక కథ చెప్పడం మొదలౌతుంది. తమ కాలనీలో ఒకరు ఇలానే దోషం ఉందని తెలిసినా పెళ్లి చేసుకున్నారని, వాళ్లు చాలా కష్టపడ్డారు అని చెబుతుంది. అయితే, అందరికీ అలా జరగాలని లేదులే అని లాస్ట్ లో చెప్పి వెళ్తుంది. కనకం చెప్పింది విని ధాన్యలక్ష్మి మరింత భయపడుతుంది. భోజనం కూడా సరిగా చేయదు.అందరూ భోజనం దగ్గర కూర్చున్నప్పుడు కూడా  ధాన్యలక్ష్మి.. కనకం చెప్పిన మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లోవాళ్లు పిలుస్తున్నా కూడా పలకదు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

కమింగ్ అప్ లో... జాతకం కోసం పెళ్లి ఆపేస్తారా అని కావ్య రాజ్ ని అడుగుతుంది. మరోవైపు అనామిక, ఈ పెళ్లి జరగకపోతే చస్తాను అని కళ్యాణ్ తో చెబుతుంది.కనకం మాత్రం ఆ నిమ్మ చెట్టు పీకేసి, చచ్చిపోయేలా చేస్తుంది. 
 

click me!