Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. ఏడో వారానికి చేరుకున్న షోలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చాడు కింగ్ నాగార్జున.
డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ముందుగానే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆడియెన్స్ ఓటింగ్ ఆధారంగా హౌస్ నుంచి దక్షి ఎలిమినేట్ అయినట్లు అధికారికంగా వెల్లడైంది. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా రెడ్ జోన్ లో ఉన్న వారి నుంచి ఒకరిని బయటకు పంపించే ప్రయత్నంలో భాగంగా హౌస్ నుంచి ఓటింగ్ ప్రక్రియను నాగార్జున నిర్వహించాడు. ఈ క్రమంలో ఎక్కువ మంది షాలిని బయటకు వెళ్లిపోవాలనే ఓటు వేశారు. దాంతో ఈ వారం షాలినీ బయటుక వెళ్లిపోయింది.
కావాలని చేశారా?
శనివారం ఎపిసోడో లో జరిగి పరిణామాలతో షాలినీ బాగా డిస్సపాయింట్ అయ్యింది. నాగార్జున వీడియోలు ప్లే చేస్తూ.. నిలబెట్టి దులిపేశాడు. దాంతో ఆమె ముఖం చూపించుకోలేకపోతోంది. అప్పటికప్పుడే తాను హౌస్ నుంచి బయటకు వెళ్లిపోడానికి రెడీగా ఉన్నట్టు వెల్లడించడంతో.. నాగార్జున బిగ్ బాస్ హౌస్ డోర్లు తీయించాడు. కానీ అక్కడితో ఆమెను ఆపేశారు. కానీ షాలినీ తనంతట గాను వెళ్లిపోతాను అంటే పంపించని బిగ్ బాస్. తాజాగా ఓటింగ్ పేరుతో ఆమెను బయటకు పంపే ప్లాన్ ను పక్కాగా అమలు చేసినట్టు అర్ధం అవుతోంది. షాలిని కూడా చాలా కామ్ గా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది.
23
దక్షి కామెంట్స్
ముందుగా ఎలిమినేట్ అయ్యి.. స్టేజ్ మీదకు వచ్చిన దక్షికి నాగార్జున ఒక ప్రత్యేకమైన టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ఆమె కొన్ని సలహాలు, సూచనలు అందించింది. ముఖ్యంగా షాలినీ, రోహిత్‌ల తీరుపై దక్షి కీలక వ్యాఖ్యలు చేసింది. రోహిత్‌తో మాట్లాడుతూ.. ఆటను ఎప్పుడూ కేవలం హార్ట్‌తో కాకుండా మైండ్‌తో ఆడాలని, అప్పుడే ఆటలో రాణించగలవని సలహా ఇచ్చింది. షాలినీ కూడా తన ప్రవర్తన, మాటల తీరు మార్చుకోవాలని పరోక్షంగా హితవు పలికింది. నోటికి తాళం త్రిగుణ్ కు వేయాలంది.
33
ఎలిమినేషన్ కు కారణం?
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టిన వారిలో కొందరు బాగానే ఇంప్రూవ్ అయినప్పటికీ, దక్షి మాత్రం ఆశించిన స్థాయిలో తన మార్క్ చూపించలేకపోయింది. ఆటపై ఫోకస్ పెట్టకపోవడం, పెద్దగా హైలైట్ కాకపోవడంతోనే ఆమె బయటికి రావాల్సి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, సీక్రెట్ రూమ్ నుంచి రీ ఎంట్రీ ఇచ్చిన షాలినీ తీరు కూడా హౌస్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె చేసే రచ్చ, తోటి సభ్యులతో వ్యవహరించే తీరు ప్రేక్షకులకు తీవ్ర చిరాకు తెప్పించడంతో ఆమె కూడా ఈ వారం ఎలిమినేషన్ బారిన పడక తప్పలేదు. మొత్తానికి ఈ డబుల్ ఎలిమినేషన్ హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లకు గట్టి వార్నింగ్ లాంటిదని చెప్పవచ్చు.