Published : Jan 04, 2024, 03:49 PM ISTUpdated : Jan 04, 2024, 03:50 PM IST
బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి Ashu Reddy తాజాగా ఓ వీడియోను పంచుకుంది. రోడ్డుపై క్యాట్ వాక్ చేస్తూ రీల్ చేసింది. తాజాగా అభిమానులతో పంచుకుంది. దానిపై నెటిజన్లు ఇలా స్పందిస్తున్నారు.
యంగ్ బ్యూటీ అషురెడ్డి నెట్టింట ఎంతలా యాక్టివ్ గా ఉంటున్నారో తెలిసిందే. సోషల్ మడియాలో మంచి క్రేజ్ దక్కించుకున్న అషురెడ్డి మరింతగా ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
26
ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఆకట్టుకునెలా ఫొటోషూట్లు కూడా చేస్తూ అదరగొడుతోంది. ట్రెండీ అవుట్ ఫిట్లలోనూ మెరుస్తూ తన ఫ్యాషన్ సెన్స్ నూ చూపిస్తోంది.
36
మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది. మతులు పోగొట్టేలా ఫొటోలకు ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. రీసెంట్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రచ్చరచ్చ చేసింది.
46
ఆ ఫొటోలను, వీడియోలను పంచుకుంటూ వస్తోంది. ఈక్రమంలో తాజాగా మిమామీ బీచ్ వద్ద ఉన్న ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రీల్ చేసింది. జీబ్రా క్రాసింగ్ ను దాటే సమయంలో క్యాట్ వ్యాక్ చేసింది.
56
తన ఫ్రెండ్ వెనకాలే ఆమె వాక్ ను షూట్ చేస్తూ వచ్చింది. పొట్టి, బిగుతైన డ్రెస్ లో అలా పబ్లిక్ గా రోడ్డుపై రీల్ చేసిన వీడియోను నెట్టింట షేర్ చేసింది. ఆ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
66
సెలెబ్రెటీ అయ్యి ఉండి ఇలా రోడ్డుపై రీల్ కోసం క్యాట్ వాక్ చేయడం ఏంటంటున్నారు. ఇలా చేయడం ద్వారా ఇంకెవరిపైనైనా ప్రభావం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ఆమె వాక్ కు ఫిదా అవుతున్నారు. కొందరు నెటిజన్లు మెచ్చట్లేదు. మరి కొందరు మాత్రం ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. అషురెడ్డి ప్రస్తుతం తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. ‘ఫోకస్’ మూవీ తర్వాత ‘ఏ మాస్టర్ పీస్’లో నటిస్తోంది.