Naga Panchami January 4th Episode: పంచమి కూడా పామే... మోక్ష ఇంట తెలిసిపోయిన నిజం..?

First Published | Jan 4, 2024, 12:15 PM IST

దానికి పంచమి క్షమాపణలు చెబుతుంది. తర్వాత... నువ్వు రోజూ వెళ్లే గుడికి తాను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అని, అక్కడ నీకు కనపడతాను లే అని చెబుతాడు.

Naga panchami


Naga Panchami January 4th Episode: మోక్ష పంచమి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూనే అడవిలో ఉండే స్వామిజీ దగ్గరకు వస్తాడు. అక్కడకు వచ్చి.. తన బాధ మొత్తం ఆ స్వామిజీకి చెప్పుకుంటాడు. పంచమి కనపడటం లేదని, ఆవేశంలో తాను కొట్టడం వల్లే, పంచమి తనను వదిలేసి వెళ్లిపోయిందని చెబుతాడు. అయితే.. పంచమికి ఏమీ కాదని ఆయన ధైర్యం  చెబుతాడు. తాను ఏం చేస్తే.. పంచమి తిరిగి తన దగ్గరకు వస్తుందో చెప్పమని ఆ స్వామిజీని మోక్ష అడుగుతాడు. దానికి ఆయన పంచమి శివయ్య అనుగ్రహంతో పుట్టిందని, ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఆమెకు చాలా ఇష్టమని, ఎంత కష్టం వచ్చినా ఆ స్వామికే చెప్పుకుంటుందని చెబుతాడు. దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిచిన ఆలయం ఉందని.. పంచమి అక్కడికే వెళ్లి ఉంటుంది అని ఆ స్వామిజీ చెబుతాడు. 

Naga panchami

ఆ ఆలయానికి మార్గం చెబితే.. తాను తన పంచమి దగ్గరకు వెళతాను అని మోక్ష అడుగుతాడు. దానికి ఆ స్వామిజీ ఉత్తరం దిక్కున ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడిని తలుచుకుంటూ వెళ్లమని చెబుతాడు. మోక్ష కూడా అటుగా నడుచుకంటూ వెళతాడు. మరోవైపు సుబ్బూతో కలిసి పంచమి నడచుకుంటూ మోక్ష దగ్గరకే వస్తూ ఉంటుంది. నువ్వు తోడు ఉంటే చాలా ధైర్యంగా ఉంటుందని, నాతో వస్తే సంతోషంగా ఉంటాను అని అడుగుతుంది. గతంలో సుబ్బూని పంచమే స్వయంగా తన దగ్గర నుంచి పంపించేస్తుంది. అదే విషయం గుర్తు చేస్తాడు. దానికి పంచమి క్షమాపణలు చెబుతుంది. తర్వాత... నువ్వు రోజూ వెళ్లే గుడికి తాను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అని, అక్కడ నీకు కనపడతాను లే అని చెబుతాడు.


Naga panchami

మధ్యలో సుబ్బు ఆగిపోతాడు. పంచమి ఏమైందని అడుగుతుంది. నువ్వు ఇంటికి వెళ్లడానికి ఇక నీకు తోడు అవసరం లేదు అని సుబ్బూ చెబుతాడు. దాని అర్థం.. మోక్ష అక్కడే పంచమిని వెతుక్కుంటూ అక్కడికే వస్తాడు. అది తెలిసే.. అలా మాట్లాడతాడు. తర్వాత.. ఇద్దరూ కలిసి ఉండటానికి ప్రయత్నించమని, ఒకరికోసం మరొకరు త్యాగాలు చేస్తే.. మీకు మీరే విడిపోవాలని అనుకుంటున్నట్లు కదా అని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మోక్ష ఉన్న వైపు పంచమిని వెళ్లమని చెబుతాడు. తర్వాత  పంచమి.. సుబ్బూని జాగ్రత్తగా ఇంటికి వెళ్లమని చెబుతుంది. తర్వాత.. మోక్షకి పంచమి కనపడుతుంది.

Naga panchami

అక్కడి నుంచి పంచమి అని పిలుస్తూ ఉంటాడు.  పంచమి కూడా మోక్ష ను చూసి చాలా సంతోషిస్తుంది. ఇద్దరూ కలుసుకుంటారు.  పంచమిని చూసినందుకు మోక్ష ఆనందం మామూలుగా ఉండదు. వెంటనే హత్తుకుంటాడు. వారిద్దరినీ దూరం నుంచి సుబ్బూ చూస్తూ ఉంటాడు. తర్వాత... ‘ నీ చేతులతోనే నన్ను చంపేయ్ పంచమి, నిన్ను కాదు.. నా సంస్కారాన్ని కొట్టుకున్నాను. నీ ముందు నిలపడటానికి కూడా నేను అర్హుడిని కాదు. ఇప్పటి నుంచి నువ్వు ఏది చెబితే  నేను అది చేస్తాను. నా కోసం నువ్వు, నీ కోసం నేను త్యాగాలు  చేయవద్దు. కలిసి జీవిద్దాం..’ అని మోక్ష చాలా ఎమోషనల్ గా చెబుతాడు. పంచమి కూడా.. మోక్షను గట్టిగా హత్తుకుంటుంది. సుబ్బూ అన్న మాటలు పంచమికి అర్థమౌతాయి. నువ్వు చిన్న పిల్లాడివి కాదని, భగవంతుడే నీ రూపంలో వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది. మోక్ష తర్వాత.. పంచమితో తనను వదిలేసి వెళ్లవద్దు అని కోరుకుంటాడు.

Naga panchami

మరో వైపు మేఘన.. ఫణీంద్ర( నాగ యువరాజా) తో మాట్లాడుతూ ఉంటుంది. యువరాణి ఆచూకీ తెలిసిందా అంటే.. ఫణీంద్ర లేదు అని చెబుతాడు. చాలా వెతికాను కానీ, దొరకడం లేదు అంటాడు. బలమైన దైవ శక్తి రక్షణలో ఉంటే తప్ప , మరెక్కడున్నా తన లక్షణాలతో గుర్తుపట్టగలను అని అంటాడు. ప్రాణాలతో ఉంటే ఎక్కడున్నా చాలు అని మేఘన అంటుంది. ‘ యువరాణి ప్రాణాలతో లేకపోతే నాగ దేవతను నేను సమాధానం చెప్పుకోలేను. యువరాణిని పెళ్లి చేసుకోవాలనే తన ఆశలన్నీ  ఆశలుగానే మిగిలిపోతాయి’ అని ఫణీంద్ర అనుకుంటూ ఉంటే.. ‘ పంచమి ప్రాణాలతో లేకపోతే నాగ మణిని దక్కించుకోలును. నా అన్నను కాపాడుకోలేను. ఈ విషయం ఫనీంద్రకు తెలీదు కదా’ అనుకుంటూ ఉంటుంది. ఇంకేదైనా మార్గం ఉందా అని ఫణీంద్ర అడిగితే.. లేదు అని మేఘన చెబుతుంది. అయితే.. మోక్ష కోసం అయినా, అతని ప్రాణాలు కాపాడటానికి అయినా కచ్చితంగా పంచమి తిరిగి వస్తుందని, తన మనసు చెబుతోందని మేఘన అంటుంది. తొందరగా వస్తే బాగుండు అని ఫణీంద్ర అనుకుంటూ ఉంటాడు. మేఘన వెళ్లిపోతుంది.

Naga panchami

ఫణీంద్ర మాత్రం.. పంచమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో అతనిని జ్వాల చూస్తుంది. ఎవరో ఏంటో కనుక్కుందామని వస్తుంది. ఎవరు నువ్వు.. ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఈ వేషం ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.  ఏమీ మాట్లాడటం లేదని.. అందరినీ పిలవబోతుంది. దీంతో.. వెంటనే ఫణీంద్ర.. పాముగా మారి జ్వాలను భయపెడతాడు. జ్వాల గట్టిగా పాము, పాము అని అరుస్తూ ఉంటుంది. ఫణీంద్ర తర్వాత వెళ్లిపోతాడు. జ్వాల  ఇంట్లోకి పరిగెత్తి.. అందరికీ.. తాను చూసిన విషయాన్ని అందరితోనూ చెబుతుంది.

Naga panchami

తాను ఓ వ్యక్తిని చూశానని.. అతను మనిషి కాదు పాము అని చెబుతుంది. అందరూ అది విని షాకౌతారు. కానీ ఎవరూ ఆ విషయాన్ని నమ్మరు. మనిషి.. పాములా ఎలా మారిపోతాడు అని కొట్టిపారేస్తారు.  ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాను నమ్ముతాను అని చిత్ర కూడా వత్తాసు పలుకుతుంది. పురాణాల్లో తాను విన్నాను అని పెద్దావిడ చెబుతుంది. బయట తెలిస్తే పెద్ద ఇష్యూ అవుతుందని ఇంట్లో వాళ్లు అనుకుంటూ ఉంటారు. ఇల్లు ఖాళీ చేయాలని కూడా అనుకుంటారు.

కమింగ్ అప్ లో మోక్ష, పంచమిలు ఇంట్లోకి వస్తుంటే.. వైదేహి ఆపుతుంది. నీ పక్కన ఉన్నది పాము అని, కొట్టి చంపేయ్ అని అంటుంది. మరోవైపు ఫణీంద్రతో పంచమి, మోక్షలు డీల్ కుదర్చుకుంటారు. తిరిగి బతికించాలని పంచమి అడుగుతుంది పైకి ఓకే చెప్పినా. లోపల మాత్రం మళ్లీ తిరిగి బతికించకూడదు అని ఫణీంద్ర అనుకుంటూ ఉంటాడు.
 

Latest Videos

click me!