అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఈ సంక్రాంతికి `నా సామిరంగ` (Naa Saami Ranga)తో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
రెండేళ్ల కింద సంక్రాంతికి ‘బంగార్రాజు’తో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు అక్కినేని నాగార్జున. మళ్లీ చాలా రోజుల తర్వాత ఈ సంక్రాంతికి ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) సినిమాతో హిట్ అందుకున్నారు.
26
సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.50 కోట్ల వరకు వసూల్ చేసింది. విడుదలైన రోజుతో పోల్చితే గ్రాడ్యుయేల్ గా టాక్ పాజిటివ్ వైపు మారుతూ వచ్చింది.
36
పోనుపోనూ సినిమా హిట్ వైపు అడుగులేసింది. మొత్తానికి థియేట్రికల్ రన్ మాత్రం విజయవంతమైంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లలో ఎక్కవ మంది చూడకపోయినా.. ఓటీటీకోసం మాత్రం ఎదురుచూస్తున్నారు.
46
ఈ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ ఆడియెన్స్ ఇప్పటికే సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
56
ఇక ఈ చిత్రాన్ని మలయాళంలో సక్సెస్ అయిన `పొరింజు మరియమ్ జోసే` చిత్రానికి రీమేక్ గా తెరకెక్కించారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించారు. ఆయనకు దర్శకుడిగా ఇదే తొలిచిత్రం.
66
ఈ మూవీలో నాగార్జునతోపాటు అల్లరి నరేష్ Allari Naresh, రాజ్ తరుణ్ (Raj Tharun) కీలక పాత్రలు పోషించారు. ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) హీరోయిన్‌గా చేసింది. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం.