సమంత గురించి ప్రియమణి భర్త హాట్ కామెంట్స్.. అంత మాట అన్నాడా, కారణం ఇదే

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 31, 2022, 05:22 PM IST

ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత పాన్ ఇండియా చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది. యశోద, శాకుంతలం లాంటి చిత్రాల్లో సామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

PREV
16
సమంత గురించి ప్రియమణి భర్త హాట్ కామెంట్స్.. అంత మాట అన్నాడా, కారణం ఇదే

స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజులగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది చైసామ్ విడాకులతో విడిపోయారు. ఆ జ్ఞాపకాల నుంచి క్రమంగా దూరం అవుతూ సమంత ప్రస్తుతం తన సినిమాలపై ఫోకస్ పెడుతోంది. 

 

26

ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత పాన్ ఇండియా చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది. యశోద, శాకుంతలం లాంటి చిత్రాల్లో సామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరో క్రేజీ బ్యూటీ ప్రియమణి.. సమంతపై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రియమణి త్వరలో భామ కలాపం అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

36

ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్లు కూడా ప్రస్తుతం హీరోలకు ధీటుగా రాణిస్తుండడంపై ప్రియమణి స్పందించింది. హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ కోసమే, పొట్టి బట్టల్లో కనిపిస్తూ, హీరోలతో రొమాన్స్ చేసే రోజులు పోయాయి. ప్రస్తుతం హీరోయిన్లకు కూడా బలమైన పాత్రలు దక్కుతున్నాయి. 

 

46

ఉదాహరణకు సమంత నటించిన 'ఓ బేబీ' చిత్రం ఘనవిజయం సాధించింది. అలాగే నయనతార కూడా గ్లామర్ రోల్ చేస్తూనే లేడి ఓరియెంటడ్ చిత్రాల్లో నటిస్తోంది అని ప్రియమణి పేర్కొంది. మంచి కథ ఉంటే లేడి ఓరియెంటెడ్ చిత్రాలని కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి కూడా వ్యక్తం అవుతోంది. 

56

సమంత తొలిసారి పుష్ప చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయడంపై ప్రియమణి స్పందించింది. 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' సాంగ్ యూట్యూబ్ లో మోతెక్కించింది. థియేటర్స్ లో కూడా సమంత తన గ్లామర్ తో ఆకట్టుకుంది. మొదటిసారి స్పెషల్ సాంగ్ చేసిన సమంత హాట్ గా కనిపించింది. నా భర్త కూడా సమంత చాలా హాట్ గా ఉందని చెప్పినట్లు ప్రియమణి తెలపడం విశేషం. 

66

ఆ సాంగ్ లో సమంత అందరి హృదయాలు దోచేసిందని ప్రియమణి ప్రశంసలు కురిపించింది. ఇదిలా ఉండగా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. టివి కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. నారప్ప చిత్రంలో నటించింది. ఫ్యామిలీ మ్యాన్ లాంటి వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం భామ కలాపం సిరీస్ లో నటిస్తోంది. 

click me!

Recommended Stories