అడ్డాల ఐశ్వర్య టివి సీరియల్స్ లో నటిస్తూ.. కొన్ని చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. నీ రూటే సపరేటు, ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ, త్రిముఖి లాంటి చిత్రాల్లో అడ్డాల ఐశ్వర్య హీరోయిన్ గా నటించింది. గత ఏడాది సెప్టెంబర్ లో అడ్డాల ఐశ్వర్య మాట్రిమోనీ సంస్థ ద్వారా శ్యామ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.