ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. లాస్య నందుతో, చూసావా నందు తులసి నిజాయితీపరులాలు లాగా ఉంటాది కానీ అబద్ధాలు ఆడుతుంది. తనంతట తను నిజం చెప్పను అని అన్నది మరి సామ్రాట్ కి ఎలా తెలిసి ఉంటుంది. మనం కాకుండా ఇంక ఎవరు చెప్పినా సామ్రాట్ నమ్మడు అని అనగా నందు,ఇప్పుడు ఆ విషయం కాదు మన ఉద్యోగాలు ఏంటి? నేను ఇంక ఆయన మొహం కూడా చూడను. నాకు ఉద్యోగం కూడా అవసరం లేదు అని అనగా,ఈ ఉద్యోగం మనకు చాలా అవసరం నందు నేను వెళ్లి బతిమిలాడతాను అని లాస్య అంటుంది.