Intinti Gruhalakshmi: సామ్రాట్ కి తోడుగా నిలిచిన తులసి.. సిగ్గు లేదంటూ రెచ్చిపోయిందిగా!

First Published Oct 12, 2022, 11:24 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 12వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..కాలనీవాసులు అందరూ తులసిని,సామ్రాట్ని తిడుతూ అనసూయతో ఏమమ్మా అనసూయ,ప్రతిసారి పక్కింటి వాళ్ళ వైపు గుడ్లు అప్పగించుకుని చూస్తావు కదా నీ ఇంట్లో ఏమవుతుందో నీకు తెలియడం లేదా ఇంత భరితెగించేసిన ఆడది అందరి ముందే మగాడితో దాండియా ఆడుతుంది, అది కూడా ఏమాత్రం భయం లేకుండా అసలేం అవుతుంది అని అనగా అనసూయ, ఏంటే నోరు లెగుస్తుంది ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. దానికి కాలనీ వాసులు, ఏం మాట్లాడడం ఏంటే మీ ఇంట్లో వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, పక్క వాళ్ళ మీద అనడం కాదు ముందు నీ ఇంటిని సరిదిద్దుకో అని గసరుతారు. దానికి అనసూయ తులసి మీద కోప్పడి, నీ వల్లే ఇదంతా వచ్చింది నేను చిలకకి చెప్పినట్టు చెప్పాను సామ్రాన్ తో తిరగొద్దు అని అయినా సరే నువ్వు వెళ్లావు, ఇప్పుడు సరిపోయిందా అందరి ముందు చెడ్డవాళ్ళం అయ్యాము. అయినా నేను ఆ సామ్రాట్ కి ఎన్నిసార్లు చెప్పాను నిజంగా మంచివాడు

అయితే నేను చెప్పినప్పుడే నీకు ఉద్యోగం మానిపించేసినా ఇంక కలవనివ్వకుండా ఉంచాలి కదా అని అనగా, తులసి ఆశ్చర్యపోయి నన్ను ఉద్యోగం అనిపించమని సామ్రాట్ గారికి చెప్పారా మీరు అని అంటుంది. దానికి అనసూయ, అవును నేను చెప్పాను నేను తప్పు చేయలేదు అని అనగా, మీరు తప్పు చేశారు అత్తయ్య అయినా మీరు నా ఉద్యోగం గురించి సామ్రాట్ గారి దగ్గరికి ఎందుకు వెళ్లారు అని అంటుంది.నేను నీ పెళ్ళైన తర్వాత ఇంటికి తెచ్చుకున్నాను కూతురు లాగా చూసుకున్నాను ఏ విషయానికి అడ్డు చెప్పలేదు. ఈ విషయంలో అడ్డు చెప్తున్నారు అంటే ఎందుకు ఆలోచించు. ఈ ఇంటికి పెద్దని నేను ఏం చెప్తే అదే చేయాలి ఇంకెప్పుడు నువ్వు సామ్రాట్ ని కలవకూడదు అని గసురుతుంది. అప్పుడు సామ్రాట్ జోక్యం చేసుకుంటూ, ఇది మీ కుటుంబ సమస్య ఇందులో నేను జోక్యం చేసుకోకూడదు అయినా సరే నేను మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. అసలు వీళ్ళందరూ తులసి గారి గురించి ఎలా అలా మాట్లాడగలుగుతున్నారు ఆడవాళ్లకు లో ఆడవాళ్ళకే ఈర్షలు ఉంటాయంటే నేను నమ్మలేదు.

కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత నమ్ముతున్నాను,ఎదుటి వారు ఎదుగుతున్నారు అంటే మీరు ఎందుకు అలా చులకన చేస్తున్నారు. తులసి గారు,నేను స్నేహితులు మాత్రమే అని గట్టిగా అంటాడు. తులసి సామ్రాట్ని వెనకేసుకుంటూ, అయినా సామ్రాట్ గారిని ఎందుకు అనడం ఆయన ఏదో తప్పు చేసినట్టు.తలుచుకుంటే ఇప్పటికిప్పుడే మన కాలనీ అంతటినీ నాశనం చేయగల స్థాయి ఆయనకున్నది అయినా సరే నా మీద గౌరవంతో ఇన్ని మాటలు పడుతున్నారు. ఆయనకు అసలు ఏం అవసరం ఇక్కడికి వచ్చి మీ దగ్గర మాటలు పడడానికి,ఆయన స్నేహానికి ఇచ్చిన విలువ అలాంటిది అని అంటుంది తులసి. దానికి అనసూయ, ఆడ,మగ మధ్య స్నేహాలు అనేవి ఉండవు. అమ్మాయి అనేది పద్ధతిగా ఉండాలి ఇలాంటివన్నీ అమెరికాలో సాగుతాయి గాని ఇక్కడ సాగవు అని అనగా, సామ్రాట్ అనసూయతో వాదిస్తూ,ఎందుకు జరగవు

అనసూయ గారు ద్రౌపతి శ్రీకృష్ణుడికి కేవలం స్నేహితురాలు మాత్రమే ప్రేమికురాలో, భార్య, చల్లెలో కాదు అలాంటప్పుడు మనం ఎందుకని ఇలాగ అబద్దపు సమాజంలో బతుకుతున్నాము అని అనగా కాలనీవాసులు, మీరు ఏం చేసినా మాకు అనవసరం కానీ ఈ కాలనీలో ఉండే అర్హత మీరు కోల్పోయారు. ఇలాంటివన్నీ కాలనీలో సహించము అని అనగా తులసికి కోపం వచ్చి, ఈ కాలనీలో ఇలాంటివి సహించరా! ఇవన్నీ ఎప్పుడు నుంచి మొదలయ్యాయి. ఒకప్పుడు శ్రీ నంది గోపాల్ గారు లాస్యని అర్ధరాత్రి ఇంటికి తీసుకువచ్చేవారు, ఎప్పుడు పడితే అప్పుడు కారులో షికారుకు వెళ్లేవారు. ఒక మంచంలో పడుకునే వారు అది మీకు తప్పుగా అనిపించలేదు కానీ ఇప్పుడు నేను చేసింది తప్పవుతుందా? నా స్నేహం తప్పవుతుందా? అప్పుడు ఎందుకు వారిని ఎవరిని ప్రశ్నించలేదు? పెళ్లికి ముందే ఇంట్లో ఉంచుకున్న మగవాళ్ళది తప్పు కాదు కానీ విడాకులను తర్వాత పరాయి మగాడితో స్నేహం చేస్తే మీకు తప్పు వచ్చింది.
 

ఇది ఎక్కడ సమాజం, ఇది ఎక్కడి నీతులు అని అనగా లాస్య మనసులో,నేను ఎక్కిపెట్టిన బాణం రివర్స్లో వచ్చి నాకే గుచ్చుకుంటుంది ఏంటి అని అనుకుంటుంది. అప్పుడు కాలనీ వాసులు ఎదురు మాట్లాడలేక అనసూయతో, ఏంటి అనసూయ ఇదా నువ్వు నీ కోడలికి నేర్పుతున్న నీతి ఎవరైనా కోడలు ఇలా ఉంటుందా, కోడలు అన్నాక పద్ధతిగా ఉండాలి కానీ ఇలా భరితెగించేకూడదు అని అనగా తులసి, కోడలు ఎలాగుండాలో మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు.ముందు మీ కోడలికి మీరు సరైన అట్ట కాదా అనేది వెళ్లి చూసుకోండి ప్రతి పండక్కి పుట్టింటికి పంపించి ఎక్కువ డబ్బు తీసుకురమ్మని బలవంతం పెడుతూనే ఉంటారు. పోనీ ఇంట్లో అయినా సరిగ్గా చూసుకుంటారా అంటే ప్రతి పని  పాపం తనే చేయాలి. అన్నీ కాళ్ళ దగ్గర తెప్పించుకుంటారు మీకు ఎప్పటికైనా ఆవిడ ఉసురు తగులుతంది.అయినా నా మాజీ భర్తని నందగోపాల్ గారు ఇచ్చే విలువ కన్నా, నా పెద్ద కొడుకు అభి ఇచ్చే విలువ కన్నా నాకు సామ్రాట్ గారు ఇచ్చే విలువ, గౌరవం చాలా ఎక్కువ. 

సామ్రాట్ గారిది నాది స్వచ్ఛమైన స్నేహం ఈరోజు నుంచి సామ్రాట్ గారు నా ఇంటికి ప్రతి స్నేహితుడు ఎలా వస్తారో అలాగే వస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు, ప్రతి పండక్కి పబ్బానికి వస్తారు. ఉదయం మధ్యాహ్నం రాత్రి అయినా వస్తారు.ఇంట్లోపలికి వస్తారు మాట్లాడుకుంటాము అడగడానికి మీరెవరు ఏం చేసుకుంటారో అది చేసుకోండి. మా స్నేహానికి ఉన్న హద్దుల మీద, సామ్రాట్ గారి సంస్కారం మీద నాకు పూర్తి నమ్మకం ఉన్నది అందుకే ఆయన్ని గౌరవిస్తాను ఎవరు ఏం చేసుకోవాలనుకుంటారో అది చేసుకోండి ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళు అయినా అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి. తులసి వెన్నంటే కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లిపోతారు కానీ అనసూయ మాత్రం అక్కడే ఉండిపోతుంది. తులసి ధైర్యానికి మెచ్చి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆనందపడతారు. 
 

ఆ తర్వాత సామ్రాట్ ఇంటికి వచ్చి జరిగిన విషయం గుర్తుతెచ్చుకొని ఆనందంగా కన్నీళ్లు తెచ్చుకుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావ్ రా అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అడగగా, కాదు బాబాయ్ నేను ఇన్ని రోజులు తులసి గారు ఎక్కడ భయపడతారో అందరి ముందు నిందలపాలు అవుతారు అని ఇలా చేశాను కానీ తులసి గారు ఇలా తెగిస్తారు అని ఇంత ధైర్యంగా ఉంటారు అని నేను అనుకోలేదు. ఇంత ఆత్మవిశ్వాసం ఉన్న ఆవిడని అన్ని మంది అలా చులకనగా చేస్తున్న సరే వెనకాడకుండా తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. ఈ రోజు నుంచి తులసి గారు కోసం భయపడాల్సిన అవసరం లేదు.
 

 మ్యూజిక్ స్కూల్ విషయంలో కూడా తిరిగి తులసి గారిని తిరిగి తెచ్చుకొని ఎలాగైనా దీని పూర్తి చేస్తాము అని అనగా తులసి వాళ్ళ బాబాయ్, అది పూర్తి అవ్వాలంటే చాలా యుద్ధాలు జరగాలి రా అని అనగా చేస్తాను బాబాయ్.తులసి గారి స్నేహం కోసం నేను ఎన్ని యుద్దాలైన చేస్తాను అని చెప్పి కార్ లో పడుకొని ఉన్న హనీ ని ఎత్తుకొని తీసుకువచ్చి ముద్దు పెట్టి లోపలకు తీసుకువెళ్తాడు సామ్రాట్.అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్, హనీ కి ముద్దు పెట్టడం కాదురా ఇప్పుడు నువ్వు నాకు ముద్దొస్తున్నావు చూద్దాము ముందు ముందున ఏం జరగబోతుందో అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలి ఉంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!