నరేష్-పవిత్ర లోకేష్ ఎపిసోడ్ ఆ మధ్య మీడియాలో ప్రముఖంగా వినిపించింది. వీరిద్దరూ వివాహం చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. నరేశ్, పవిత్ర మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఆలయాన్ని జంటగా సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఫోటోలు బయటికి రావడంతో పెళ్లి చేసుకున్నారనే ప్రచారం జరిగింది.
ఈ వార్తలపై నరేష్ నేరుగా స్పందించారు. పవిత్ర లోకేష్ ని నేను వివాహం చేసుకోలేదు. మేమిద్దరం కలిసి జీవిస్తున్నాము. ఆమె అంటే నాకు ఇష్టం. పరస్పర అవగాహన కుదిరింది. జీవితంలో అభిమానించే, ప్రేమించే నమ్మకమైన వ్యక్తి దొరికింది, పవిత్రతో నా ప్రయాణం అలా సాగుతుంది అన్నారు.
ఇక వివాహం అంటారా ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. అలాగే నాకు వివాహ వ్యవస్థపై పెద్దగా నమ్మకం లేదు. రిలేషన్షిప్ కి మ్యారేజ్ లైసెన్సు మాత్రమే. పెళ్లైన ప్రతి పది జంటల్లో ఎనిమిది మంది విడిపోతున్నారు. పెళ్లి అనేది అనవసరం అన్న అర్థంలో ఆయన మాట్లాడారు. మూడో భార్య రమ్యతో నరేష్ కి విడాకులు కాలేదని, అందుకే ఆయన అబద్ధం చెబుతున్నారనే ఒక వాదన ఉంది.
పవిత్రను నరేష్ వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా ఇద్దరూ కలిసి జీవిస్తున్న మాట వాస్తవం. వారే స్వయంగా ధృవీకరించారు కాబట్టి ఎలాంటి సందేహం లేదు . కాగా పవిత్ర లోకేష్ తో కూడా నరేష్ విడిపోయారు, ఆమెను వదిలేశాడనేది లేటెస్ట్ న్యూస్. రెండు రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో ఇది చర్చనీయాంశం అయ్యింది.
ఈ క్రమంలో నరేష్ నాలుగో ప్రయత్నం కూడా ఫెయిల్ అయిందా? పవిత్రను కూడా వదిలేశారా? అంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే ఆయన మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నారట. ఆ కారణంగానే పవిత్రకు గుడ్ బై చెప్పేశాడట. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరి వరుస కథనాల నేపథ్యంలో నరేష్ స్పందిస్తారేమో చూడాలి.
Naresh- Pavitra Lokesh
దివంగత నటి విజయనిర్మల కుమారుడైన నరేష్ మూడు వివాహాలు చేసుకున్నారు. ఆయన మూడో భార్య రమ్య రఘుపతి న్యాయపోరాటం చేస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ నరేష్ కి స్టెప్ ఫాదర్ అవుతారు. విజయనిర్మలపై ప్రేమతో నరేష్ ని కృష్ణ సొంత కొడుకుగా ఆదరించారు.