సరోగసీ యాక్ట్ 2021... నయనతార దంపతులకు 5 సంవత్సరాల జైలు శిక్ష?

First Published Oct 12, 2022, 11:20 AM IST


తల్లిదండ్రులైన ఆనందం నయనతార, విగ్నేష్ దంపతులకు ఎంతో సేపు నిలవలేదు. సరోగసీ పద్దతిలో పిల్లల్ని కన్న ఈ దంపతులపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు చట్టపరమైన చిక్కులు వెంటాడేలా కనిపిస్తున్నాయి. 

పెళ్ళైన నాలుగు నెలలకే తమకు పిల్లలు పుట్టినట్లు నయనతార-విగ్నేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. నయనతార గర్భం దాల్చని పక్షంలో వీరు సరోగసీని ఆశ్రయించారని అందరూ నమ్ముతున్నారు. అదే సమయంలో వీరికి సరోగసీ చట్టం వర్తిస్తుందా లేదా అనే వాదన మొదలైంది. నిజంగా సరోగసీ పద్దతిలో నయనతార పిల్లల్ని కన్నట్లైతే వారికి శిక్ష తప్పదు. 
 


సరోగసీ చట్టాన్ని నయనతార-విగ్నేష్ దంపతులు ఉల్లగించినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. చట్ట ప్రకారం పెళ్ళైన దంపతులు, విడాకులు తీసుకున్న, భర్త చనిపోయిన ఒంటరి మహిళలు సరోగసీ పద్దతిలో పిల్లల్ని కనవచ్చు. నయనతార-విగ్నేష్ గత ఏడేళ్ళగా సహజీవనం చేస్తున్నారు. పెళ్ళికి ఐదు నెలల ముందే సరోగసీని వీరు ఆశ్రయించినట్లు తెలుస్తుంది. 

అంటే పెళ్లి కాకుండా నయనతార-విగ్నేష్ సరోగసీ పద్దతిలో పిల్లల్ని కన్నట్లు అయ్యింది. తమిళనాడు గవర్నమెంట్ వీరిపై విచారణ చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైనెస్స్ ని ఆదేశించారు. అలాగే తమ కవల పిల్లల పుట్టుకకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నయనతార దంపతులను ప్రభుత్వం కోరింది. 
 

సరోగసీ నిబంధనలు నయనతార దంపతులు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరోగసీ చట్టం 2021 ప్రకారం నయనతార-విగ్నేష్ లకు రూ. 50 వేల జరిమానా, 5 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఈ క్రమంలో నయనతార దంపతులు న్యాయపరమైన సలహాల కోసం లాయర్లను ఆశ్రయిస్తున్నారట.

పెళ్ళైన తర్వాత కూడా సరోగసీ పద్దతిలో పిల్లల్ని కనడానికి నిబంధనలు ఉన్నాయి. భార్యాభర్తలు పిల్లల్ని కనడానికి అనుకూల పరిస్థితులు లేకపోతేనో, ఆరోగ్య కారణాలతోనో వైద్యుల అనుమతితో మాత్రమే సరోగసీని ఆశ్రయించాలి. అంటే పిల్లల్ని కనడానికి అనువైన ఆరోగ్యం, పరిస్థితులు ఉన్న దంపతులు సరోగసీ ద్వారా పిల్లల్ని కనకూడదని దానర్థం.

ఈ చట్టంలో ఇంకా అనేక నిబంధనలు ఉన్నాయి. గతంలో విదేశీయులు అద్దె గర్భం కోసం ఇండియన్ మహిళలను సంప్రదించేవారు. ఇది వ్యాపారంగా మారిపోవడంతో ఇండియన్ గవర్నమెంట్ విదేశీలకు ఇండియాలో సరోగసీ విధానాన్ని రద్దు చేసింది. సరోగసీ పద్దతిలో నయనతార దంపతులు సంతానం పొందితే వారు నిబంధనలు అతిక్రమించినట్లే. దీనికి సహకరించిన వైద్యులు, హాస్పిటల్ యాజమాన్యం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వారు లక్ష రూపాయల ఫైన్, 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాలి.

click me!