ఎవరికి సిగ్గుగా అనిపించడం లేదా అని అనగా, తప్పేముందిరా నిజమే కదా అని అభి అంటాడు. అరే మన అమ్మను తప్పుపడుతున్నావా అమ్మా అలా చేస్తుంది అని నీకు ఎలా అనిపించింది అని ప్రేమ్ అంటాడు.అప్పుడు అభి కొట్లాటకు దిగుతాడు. అప్పుడు ప్రేమ్, అభి కొట్టుకుంటూ ఉండగా లాస్య నందుతో, వాళ్ళిద్దర్నీ హద్దుల్లో ఉండమని చెప్పు నందు గొడవను ఆపు అని అనగా, వాళ్ళ తల్లే హద్దుల్లో లేదు వాళ్ళే హద్దుల్లో ఉంటారు చీకట్లో చేయి దాటిపోయింది ఇప్పుడు వచ్చి ఏం తప్పు చేయలేనట్టు మాట్లాడుతుంది అని నందు అంటాడు.