ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ తో,నువ్వు ఇప్పుడు హనీకి అబద్దం చెప్పావు, తను ఏమన్నదో గుర్తు ఉంది కదా అబద్ధం చెప్తే నీతో ఇంకెప్పుడు మాట్లాడను అంది అని అంటాడు. ఆ తర్వాత సీన్లో, లక్కీ షాప్ కి వెళ్లి డ్రాయింగ్ షీట్స్ కొంటాడు. అదే సమయంలో హనీ కూడా అక్కడికి వెళ్తుంది అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటార. అలాగా తిరిగి ఇంటికి వెళ్దాం అనుకునే లోగా తులసి, దివ్య వినాయక చవితికి కావాల్సిన పదార్థాలు తీసుకుని రావడం వీళ్లు చూస్తారు.