Intinti Gruhalakshmi: కుమిలి కుమిలి ఏడుస్తున్న తులసి.. రోడ్డున పడ్డ ప్రేమ్, శృతి జీవితం!

Navya G   | Asianet News
Published : Mar 07, 2022, 11:58 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ గృహలక్ష్మి. భర్త ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తే అతని సంతోషం కోసం అతనికి విడాకులు ఇచ్చి ప్రేమించిన అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అప్పుడే భార్య గొప్పది అన్నట్టు చూపించే ఈ సీరియల్ కు అభిమానులు మాములుగా లేరు. అలాంటి ఈ సీరియల్ లో ఈరోజు మార్చ్ 7వ తేదీ ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ చూద్దాం...  

PREV
16
Intinti Gruhalakshmi: కుమిలి కుమిలి ఏడుస్తున్న తులసి.. రోడ్డున పడ్డ ప్రేమ్, శృతి జీవితం!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. ప్రేమ్, శృతి నడుచుకుంటూ గమ్యం లేని ప్రయాణం చేస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నాం అని శృతి అడగ్గా నాకు కూడా తెలియదు శృతి అని సమాధానం చెప్తాడు. అప్పుడే గంట శబ్దం వినిపించడంతో ఇద్దరు గుడిలోకి వెళ్లి హారతి తీసుకుంటారు. అతర్వాత అక్కడే కూర్చుంటారు.
 

26

తల్లి తులసి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని బాధ పడుతారు. తులసి అంటీ ఇలా చేస్తుందని ఊహించలేదు అని శృతి అంటుంది. ఇక ప్రేమ్ తన తల్లి గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడకుండా అది పరిస్థితుల ప్రభావం అని మాట మారుస్తాడు.. అలా ఎలా అంటావ్ ప్రేమ్.. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేంత తప్పు చేశా అనుకుంటున్నావా అని అంటుంది.
 

36

నీకు ఏ లోటు లేకుండా చూసుకోవడమే నా కర్తవ్యం అని ప్రేమ్ అంటాడు. అతర్వాత అభి, అంకిత అలా ఎలా చేసింది అని అనుకుంటారు.. కుటుంబం అంత తులసిని నిందిస్తారు. మరోవైపు నందు, లాస్య కూడా అలా ఎలా చేస్తుంది అని అనుకుంటారు.. ఇక అందరూ భోజనాలకు వచ్చి కూర్చుంటారు.
 

46

భోజనాలకు వచ్చిన ఎవరు భోజనం చెయ్యరు. అందరూ తులసి వైపు దినంగా చూస్తారు.. ఎందుకు తినలేదు అని తులసి అడగడంతో అనసూయ సీరియస్ అవుతుంది..  నీకు ఫీలింగ్స్ లేకపోవచ్చు మాకు లేనట్టు కాదు కదా మామ్ అని దివ్య సీరియస్ అవుతుంది.
 

56

మమ్మల్ని కాదు నువ్వు తిని చూపించు అని అనసూయ అంటే తులసి తిని చూపిస్తుంది. దీంతో లాస్య రెచ్చిపోయి నువ్వు ఏమైనా చేస్తావ్ అని అంటే నువ్వు మాట్లాడకు లాస్య అని తులసి ఫైర్ అవుతుంది. దీంతో మవైపు ఒకరినైనా మాట్లాడనివ్వు మామ్ అని దివ్య అంటుంది.
 

66

దీంతో అందరూ సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక అక్కడే ఉన్న తులసి కుమిలి కుమిలి కన్నీళ్లు పెడుతుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరీ రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

click me!

Recommended Stories