అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు.. ఆల్రెడీ ఇద్దరితో బ్రేకప్, ఇప్పుడు మూడో వ్యక్తితో.. తేజస్వి బోల్డ్ కామెంట్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 07, 2022, 11:42 AM IST

తేజస్వి గతంలో నాని హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొంది. ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఛాన్స్ దక్కించుకుంది. ఓటిటిలో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ షోకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 

PREV
16
అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు.. ఆల్రెడీ ఇద్దరితో బ్రేకప్, ఇప్పుడు మూడో వ్యక్తితో.. తేజస్వి బోల్డ్ కామెంట్స్

నటి తేజస్వి మదివాడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత సోదరిగా తేజస్వి నటించింది. ఆ చిత్రంలో అల్లరి పిల్లగా కనిపించింది ఈ యంగ్ బ్యూటీ. 

26

ఆ తర్వాత Tejaswi Madivada .. మనం, హార్ట్ అటాక్  లాంటి చిత్రాల్లో రోల్స్ చేసింది. ఇక Ram Gopal Varma ఐస్ క్రీం చిత్రంలో తేజస్వి ప్రధాన పాత్రలో బోల్డ్ రోల్ లో నటించింది. అప్పటి నుంచి తేజస్వి గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. ఛాన్స్ వచ్చినప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే ఉంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో సాయిధరమ్ తేజ్ కి మరదలిగా నటించింది. 

36

సోషల్ మీడియాలో గ్లామర్ షోకి తెరతీయడంతో తేజస్వికి బోల్డ్ బ్యూటీగా ముద్ర పడింది. ప్రస్తుతం తేజస్వి సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్స్ తో కుర్రాళ్లలో క్రేజ్ పెంచుకుంటోంది. ఇదిలా ఉండగా తేజస్వి గతంలో నాని హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొంది. ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఛాన్స్ దక్కించుకుంది. ఓటిటిలో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ షోకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 

46

ఈ షోలో హౌస్ కి తొలి కెప్టెన్ గా ఎంపికైంది తేజస్వి. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో తన రిలేషన్ షిప్స్ పై ఓపెన్ అవుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది తేజస్వి. ఎంతమందితో రిలేషన్ లో ఉన్నావు అని ప్రశ్నించగా.. గతంలో ఇద్దరితో రిలేషన్ లో ఉన్నాను. కానీ వారిద్దరితూ బ్రేకప్ జరిగింది. 

56

ఇప్పుడు మరో వ్యక్తితో రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నాను. అయితే ఇది పూర్తి స్థాయి ప్రేమేనా ? టెంపరరీ రిలేషనా ? అనేది అర్థం కావడం లేదు.. చూడాలి అంటూ బదులిచ్చింది. తన రిలేషన్ షిప్స్ బ్రేకప్ అవుతుండడంతో తన పెళ్లి కూడా వాయిదా పడుతూ వస్తోందని.. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే అని తెలిపింది తేజస్వి. 

66

కాను తాను ఎవరితో రిలేషన్ లో ఉన్నాను.. ప్రియుడి పేరు లాంటి వివరాలని మాత్రం తేజస్వి రివీల్ చేయలేదు. దీనితో తేజస్వి రిలేషన్ షిప్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇటీవల తేజస్వి షేర్ చేస్తున్న ఫోటోలు మతిపోగొట్టేలా హాట్ నెస్ తో ఆకట్టుకుంటున్నాయి. దీనితో తేజస్వి తాను బోల్డ్ రోల్స్ కి రెడీ అంటూ సంకేతాలు పంపుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories