ఈరోజు ఎపిసోడ్ లో రిషి, జయచంద్రతో మాట్లాడుతూ ఉండగా అప్పుడు వసుధార రిషికి సైగలు చేస్తూ ఉంటుంది. అది గమనించిన జయచంద్ర పక్కనే ఉన్న చున్నీని చూసి రిషి ఈ గదిలో ఎవరైనా ఆడవారు ఉండేవారా అని అడుగుతారు. అప్పుడు రిషి వసుధార వైపు చూడక వసుధార చున్నీవైపు చూడమంటూ సైగలు చేస్తుంది. అప్పుడు రిషి వసుధార దాన్ని తీసేయ్ అనగా వసుధార దాన్ని తీసేస్తుంది. ఇది గెస్ట్ రూమ్ సార్. భోజనం ఇక్కడికి తీసుకురావాలా లేకుంటే మాతో కలిసి భోజనం చేస్తారా అనగా మీ ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తాను అని అంటారు జయచంద్ర.