Intinti Gruhalakshmi: పరంధామయ్యను చూసి కుమిలిపోతున్న తులసి.. పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్న అనసూయ?

First Published Nov 21, 2022, 10:55 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు నవంబర్ 20వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈ రోజు ఎపిసోడ్లో పరంధామయ్య ఎమోషనల్ అవుతూ మీ అత్తయ్య ముఖం చూడాలని లేదమ్మా తీసుకెళ్ళమ్మా అనడంతో తులసి లోపలికి పిలుచుకొని వెళుతూ మీరు ఎవరిని దూరం చేసుకుంటున్నారు ఎవరిని కోల్పోతున్నారో మీకు ఇప్పుడు అర్థం కావడం లేదు ఆవేశంతో మీ మనసు మూసుకుపోయింది. ఇప్పుడు ప్రపంచంలో మీకంటే పేదవాళ్లు ఇంకెవరూ లేరు అని అనసూయకు చెప్పి అక్కడ నుంచి పరంధామయ్యను తీసుకొని వెళ్ళిపోతుంది తులసి. రామయ్య ఈరోజు నుంచి ఈ గది మీ గది ఈరోజు నుంచి ఇది మీ ఇల్లు రండి పదండి మావయ్య అని లోపలికి పిలుచుకొని వెళ్లి కూర్చోబెడుతుంది తులసి.
 

ఆ తర్వాత తులసి సామ్రాట్ దగ్గరికి వెళ్ళగా చాలా బాధగా అనిపిస్తుంది తులసి గారు అని అంటాడు సామ్రాట్. ఇంత వయసు వచ్చాక ఇన్ని చూశాక పరంధామయ్య గారికి ఈ వయసులో ఇన్ని బాధలు ఏంటో కట్టుకున్న భార్య ఇలా చీపురు పుల్లలా తీసేయడమేంటి అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు సామ్రాట్. అప్పుడు తులసి నా ధైర్యం మా మామయ్య మా మామయ్య ఇలా కుప్పకూలిపోవడం నేను చూడలేకపోతున్నాను అని తులసి ఎమోషనల్ గా మాట్లాడడంతో ఆ మాటలు విన్న పరంధామయ్య కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. మరొకవైపు అనసూయ జరిగిన విషయాలు తలుచుకుని కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.

అప్పుడు అనసూయ పిచ్చి పట్టిన మాదిరిగా నాకు ఎవరు అవసరం లేదు అందరూ వెళ్లిపోండి అంటూ అక్కడున్న సామాన్లు విసిరేస్తూ ఉండగా లాస్య ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అనసూయ కోపంతో ఊగిపోతూ ఉంటుంది. అప్పుడు లాస్యను అందుకు నేను వాళ్ళ అమ్మని చూసుకుంటానని మాట ఇచ్చాను కానీ ఆంటీ నా మాట వినడం లేదు ఇప్పుడు ఏం చేయాలి అని లాస్య కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఎలా అయినా మావయ్యని వెనక తీసుకురావాలి అనుకుంటే ఉంటుంది. మరొకవైపు పరంధామయ్య నిద్రపోతూ నన్ను క్షమించు తల్లి నేను ఎవరికీ ఏమీ చేయలేని ఒక అసమర్ధుడిని పనికిరాని వాడిని అనుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న తులసి పక్కకు వెళ్లి ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

ఇంతలో తులసి దగ్గరికి వెళ్లిన సామ్రాట్ ప్లీజ్ తులసి గారు మీరే అలా అయిపోతే ఎలా బాధను కంట్రోల్ చేసుకోండి అని తులసిని ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడు తులసి నా వల్ల కావడం లేదు సామ్రాట్ గారు అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది. నిద్రలో కూడా మామయ్య జరిగింది తలుచుకుని కుమిలిపోతున్నారు అని తులసి ఎమోషనల్ అవుతూ ఉండగా సామ్రాట్ కూడా బాధపడుతూ ఉంటాడు. మావయ్య కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డారు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు ఆరోగ్యాన్ని జయించారు అని తులసి ఎమోషనల్ గా మాట్లాడుతుంది. కానీ ఈ వయసులో మామయ్య గారు ఎని నిందలు ఎన్ని బాధలు మోయాల్సి వస్తుందో చూస్తున్నారు కదా అని ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది.
 

 ఎవరు అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ తాళి కట్టించుకున్న భార్య 50 ఏళ్ల పాటు కలిసి ఉన్న భార్య అలా నిందలు వేసి బాధపడితే ఎలా ఉంటుంది అనుకుంటూ ఎమోషనల్ అవుతూ బాధపడుతూ ఉంటుంది తులసి. తర్వాత సామ్రాట్ గారు నేను వెళ్లొస్తాను తులసి గారు అనడంతో వెంటనే తులసి ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను మీరు వెళ్లి రండి అని చెప్పి దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉంటుంది. పరంధామయ్య మాత్రం నిద్రలో కూడా నన్ను క్షమించు తల్లి అని ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు. క్షమించండి మామయ్య మీ పక్కనే ఉండి కూడా మీకు ఇలాంటి బాధలు కలిగించేలా చేశాను అని తెలిసి కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
 

మరొకవైపు అనసూయ ఇంటి బయట గట్టిగా అరుస్తూ కోపంగా మాట్లాడుతూ తల గట్టిగా పట్టుకుని లేదు వద్దు నాకు ఎవరూ వద్దు అంటూ గట్టిగట్టిగా తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు లాస్య ఇంట్లో అందరూ అనసూయపు చూస్తూ బాధపడుతూ ఉంటారు. అందరూ కలిసి నన్ను ఒంటరిగానే చేసి మోసం చేస్తున్నారు అనే బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అభి వాళ్ళు అనసూయ ప్రవర్తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అందరూ ఇంట్లోకి వెళ్తూ ఉండగా అందరి మీద అరుస్తూ ఉంటుంది.
 

అప్పుడు శృతి నచ్చ చెప్పడానికి ప్రయత్నించగా శృతి మీద కోపంతో అరుస్తుంది. దాంతో శృతి ఏం చేయలేక కోపంతో ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు తులసి కుటుంబం మొత్తం అందరూ బాధపడుతూ ఉంటారు. పరంధామయ్య ఉన్నట్టుంది నిద్రలో పైకి లేచి ఉలిక్కి పడతారు. మరొకవైపు నందు, ప్రేమ్ అభివాళ్లు జరిగిన విషయం తలుచుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు పనుందామయ్య నిద్రలో అనసూయ పిలుస్తున్నట్టుగా తలుచుకొని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు తులసి పాలు తీసుకుని రాగా ఆ పాలు తాగలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు పరంధామయ్య. అప్పుడు తులసి పరంధామయ్యను చూసి బాధపడుతూ ఉంటుంది.

click me!