జెన్యూన్‌ పర్సన్‌ని ఎలిమినేట్‌ చేసి స్నేక్‌ని సేవ్‌ చేశారు.. `బిగ్‌ బాస్‌ 6` పై ట్రోల్స్..

Published : Nov 21, 2022, 10:09 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 6 రియాలిటీ షో పదకొండు వారాలు పూర్తి చేసుకుంది. చివరగా మెరీనా ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఆమె ఎలిమినేషన్‌పై, శ్రీసత్యని సేవ్‌ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   

PREV
16
జెన్యూన్‌ పర్సన్‌ని ఎలిమినేట్‌ చేసి స్నేక్‌ని సేవ్‌ చేశారు.. `బిగ్‌ బాస్‌ 6` పై ట్రోల్స్..

బిగ్‌ బాస్‌ 6 తెలుగు(Bigg Boss 6 Telugu) ఈ సీజన్‌ చాలా విమర్శల పాలవుతుంది. ఆశించిన స్థాయిలో షోని రక్తి కట్టించలేకపోతున్నారు. అది కంటెస్టెంట్ల లోపమా? లేక బిగ్‌ బాస్‌ లోపమా? అనేది సస్పెన్స్ గా మారింది. చాలా వరకు హౌజ్‌ మేట్స్ సేఫ్‌ గేమ్‌ అడుతున్నారని, జెన్యూన్‌గా గేమ్‌ ఆడటం లేదని, గేమ్‌లు, వాదోపవాదాల కంటే సైలెంట్ కూర్చొని ముచ్చట్లకే పరిమితమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 

26

దీనికితోడు ఈ సీజన్‌ లో ఇప్పటి వరకు ఎలాంటి ట్విస్ట్ లు, టర్న్‌లు లేవు. సాదాసీదాగా నడిపిస్తున్నారు. గతంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, సీక్రెట్‌ రూమ్‌లు, గెస్ట్ అప్పియరెన్స్ లతో సాగేది. ఈ సారి సడెన్‌ ఎలిమినేషన్లు తప్ప ఇంకేం లేవు. దీంతో బోరింగ్‌గా ఉంటుందని, మంచి కంటెస్టెంట్లని ఎలిమినేట్‌ చేసి కన్నింగ్‌ కంటెస్టెంట్లని హౌజ్‌లో పెట్టుకుంటున్నారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. 
 

36

తాజాగా మెరీనా (Marina) ఎలిమినేషన్‌ విషయంలోనూ అదే జరుగుతుంది. పదకొండో వారంలో మెరీనా ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. అతి తక్కువ ఓట్లు వచ్చిన శ్రీసత్య, మెరీనాలు చివర్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, శ్రీ సత్య (Sri Satya)సేవ్‌ అయ్యింది. మెరీనాని ఎలిమినేట్‌ చేశారు. దీంతో భర్త రోహిత్‌తోపాటు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇది అందరిని కదిలించింది. 

46

ఇదే ఇప్పుడు మరోసారి బిగ్‌ బాస్‌ 6పై ట్రోల్స్ కి కారణమవుతుంది. కన్నింగ్‌ కంటెస్టెంట్‌ శ్రీసత్యని సేవ్‌ చేసి జెన్యూన్‌ పర్సన్‌ని ఎలిమినేట్‌ చేశారని విమర్శిస్తున్నారు. ఈ వారం శ్రీ సత్యని ఎలిమినేట్‌ చేయాలని గత మూడు నాలుగు రోజులుగా బిగ్‌ బాస్‌ ఆడియెన్స్ కోరుతున్నారు. హౌజ్‌లో శ్రీసత్య ఓ స్నేక్‌ లాంటి కంటెస్టెంట్ అని, ఆమె ఫెయిర్‌ ఆట ఆడదని అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా మెరీనా ఎలిమినేషన్‌తో బిగ్‌ బాస్‌ 6ని ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేస్తున్నారు. 
 

56

నిజానికి ఇద్దరి మధ్య ఓట్ల శాతం వన్‌ పర్సెంటేజ్‌ కంటే తక్కువే. జీరో పాయింట్‌ రెండు, మూడు శాతం మాత్రమే ఉంటుంది. అయినా ఎలిమినేషన్‌ తప్పలేదు. బట్‌ ఆడియెన్స్ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో మాత్రం శ్రీసత్య జెన్యూన్‌ గా లేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మదర్‌ ఇండియాని పంపించి, స్నేక్‌ని కాపాడారని కామెంట్లు చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

66

మెరీనా, రోహిత్‌ జంట మొదట ఒక్కటిగానే వచ్చారు. ఇద్దరు ఒక్కటిగానే ఆడారు. మధ్యలో వారి ఆటతీరుని పరిశీలించి ఇద్దరు సపరేట్‌ కంటెస్టెంట్లుగా అవకాశం ఇచ్చారు.మొదట్లో కాస్త డల్‌గానే ఉన్నా, ఆ తర్వాత నెమ్మదిగా వీరిద్దరు పుంజుకున్నారు. జెన్యూన్‌ గేమ్‌ ఆడుతూ తమ నిజాయితీని చాటుకున్నారు. ఎప్పుడూ రాంగ్‌గా ఆడలేదని, ఫేక్‌ గేమ్‌లకు దూరంగా ఉంటూ తమ సిన్సియారిటీని చాటుకుంటున్నారనే పాజిటివ్‌ థింకింగ్‌ అందరిలోనూ ఉంది. ఆట తీరులోనూ వాళ్లు చాలా మెరుగయ్యాయి. కానీ చివరికి మెరీనా ఎలిమినేట్ కావడం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తం కావడం గమనార్హం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories