ఇప్పుడెలా మరి నేను ఆయన కుదరదు అని చెప్పేస్తాను వేరే వాళ్ళని చూసుకుంటారు అనడంతో నేను కాన్వెంట్ లో చదువుకున్నాను కదా అంటే నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను అనడంతో అవకాశం దొరికింది కదా అని లాస్య అదేంటి అంకిత, శృతిది బట్లర్ ఇంగ్లీష్ అంటావా అంటూ వారి మధ్య చిచ్చు పెట్టడంతో శృతి అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు ఆంటి మీరు ఇలా చేశారు చూశారు కదా శృతి ఎలా హర్ట్ అయింది అనడంతో నేనేం చేశాను అంకిత అంటూ ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటుంది లాస్య. అప్పుడు అంకిత ఆంటీ శృతి బాధపడుతుందేమో అని అనగా తులసి బుక్కులు పక్కన పడేస్తాను మళ్ళీ చూసుకుంటాను అనడంతో ఏదైనా శుభకార్యానికి ముందు శ్రీకారం చుట్టాలి ఇలా పోస్ట్ పోన్ చేయకూడదు అంటాడు పరందామయ్య.