Intinti Gruhalaxmi: లాస్యకు దగ్గరైన దివ్య.. ప్రేమ్ కు నరకం చూపిస్తున్న ఇంటి ఓనర్!

Published : Mar 15, 2022, 01:34 PM IST

Intinti Gruhalaxmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalaxmi) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దివ్య భోజనం ముందు కూర్చుని ఉండగా భోజనం చేస్తునందుకు థ్యాంక్స్ అని నందు (Nandu) చెబుతాడు.

PREV
16
Intinti Gruhalaxmi: లాస్యకు దగ్గరైన దివ్య.. ప్రేమ్ కు నరకం చూపిస్తున్న ఇంటి ఓనర్!
Intinti Gruhalaxmi

దాంతో దివ్య (Divya) ఈ క్రెడిట్ అంతా లాస్య ఆంటీ దే డాడ్ అని చెబుతుంది. దాంతో తులసి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ క్రమంలో దివ్య వాళ్ల నాన్నను మెచ్చుకుంటూ తులసి ను దెప్పి పొడుస్తుంది. ఈ క్రమంలో లాస్య (Lasya) వావ్ బాగా చెప్పావ్ అంటూ మరింత నూరి పోస్తుంది.
 

26
Intinti Gruhalaxmi

అలా దివ్య (Divya) అన్నం తింటున్న క్రమంలో లాస్య, దివ్యలు ఒక సెల్ఫీ కూడా దిగుతారు. అది చూసిన తులసి మరింత ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత దివ్య వాళ్ళ డాడీని హాగ్ చేసుకుని లాస్యను (Lasya) ఆంటీ ఐలవ్యూ అని అంటుంది.
 

36
Intinti Gruhalaxmi

ఆ తర్వాత తులసి తోటి కోడలు ఆమె ప్రేమ్ (Prem) వాళ్ళ దగ్గరికి వెళ్ళిందన్న సంగతి తులసికి తెలిసిపోయిందేమో అని.. ఆ విషయాన్ని తులసికి ఆమె కంగారుపడి చెబుతుంది. కానీ తులసి (Tulasi) ఈ విషయం నాకు ఎవరూ చెప్పలేదు. నువ్వే నాకు చెప్పావు అని అంటుంది.
 

46
Intinti Gruhalaxmi

ఆ తర్వాత తులసి (Tulasi)  ఏడుస్తూ ఉండగా మనుషులనే వద్దని తరిమేసాక ఎందుకీ దొంగ కన్నీళ్లు అని దివ్య అడుగుతుంది. తులసి ఎంత చెప్పినా వినకుండా దివ్య (Divya), తులసి విషయంలో నెగిటివ్ గా ఆలోచిస్తూ తనని అనేక మాటలతో ఇబ్బంది పెడుతుంది.
 

56
Intinti Gruhalaxmi

మరోవైపు శృతి (Sruthi) ప్రేమ్ లు ఆరుబయట చాప వేసుకొని పడుకుంటారు. అదే క్రమంలో కొన్ని జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోని కొంత ఆనందం వ్యక్తం చేసుకుంటూ జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత తులసి (Tulasi) నందులకు కొంతసేపు మాటల ఘర్షణ జరుగుతుంది.
 

66
Intinti Gruhalaxmi

తరువాయి భాగంలో దివ్య (Divya) తన ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇచ్చే క్రమంలో ఫుడ్ వేస్ట్ చేసినందుకు తులసి చంప మీద కొడుతుంది. మరోవైపు ప్రేమ్ రెంటుకు ఉంటున్న ఇంటి ఓనర్ ప్రేమ్ (Prem) పై విరుచుకు పడుతుంది. మరీ తర్వాత ఎపిసోడ్ లో ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories