మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు తదుపరి నటించబోతున్న చిత్రం 'గాలి నాగేశ్వర రావు'. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్, శృంగార తార సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కోన వెంకట్ ఈ చిత్రానికి రచయిత.
26
సన్నీ లియోన్ ఈ చిత్రంలో నటిస్తోంది అని న్యూస్ రాగానే ఈ మూవీకి మంచి క్రేజ్ వచ్చింది. సౌత్ లో కూడా కొన్ని చిత్రాల్లో సన్నీలియోన్ నటించింది. దాదాపు ఏడేళ్ల క్రితం సన్నీలియోన్ విష్ణు సోదరుడు మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ చిత్రంలో మెరిసింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు మనోజ్ అన్న విష్ణుతో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోంది.
36
ఈ చిత్రంలో సన్నీ లియోన్ రేణుక పాత్రలో నటిస్తోంది. సన్నీ లియోన్ రోల్ గురించి రచయిత కోన వెంకట్ మరిన్ని వివరాలు రివీల్ చేశారు. ఈ చిత్రంలో సన్నీలియోన్ రేణుక పాత్రలో ఎన్నారై యువతిగా నటిస్తోంది. విదేశాల నుంచి విలేజ్ కు తిరిగి వచ్చిన పాత్రలో సన్నీలియోన్ ఎంటర్టైన్ చేయబోతోందట.
46
విలేజ్ లో మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ స్నేహితులుగా కనిపిస్తారట. వీరి మధ్య హాస్యం, రొమాన్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఎన్నారై యువతిగా వచ్చిన సన్నీలియోన్ ఆ గ్రామంపై ఎలాంటి ప్రభావం చూపింది అనేది ఆసక్తిగా ఉండబోతోంది అని అంటున్నారు.
56
ఆల్రెడీ ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ ఐంది. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే జరగనుంది. మంచు ఫ్యామిలీ షూటింగ్స్ కోసం ఎక్కువగా తిరుపతినే ఎంచుకుంటారు.
66
గరుడవేగ చిత్రంలో సన్నీలియోన్ ఐటెం సాంగ్ లో మెరిసింది. ఆ తర్వాత సన్నీలియోన్ తెలుగులో చేస్తున్న మూవీ ఇదే. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రివీల్ కానున్నాయి.