పరంధామయ్య, ప్రేమ్ ఇద్దరు అల్లరి చేస్తుండగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అనసూయ పరంధామయ్య సరదాగా పోట్లాడుకుంటూ ఉండగా అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. తులసి సంక్రాంతి పండుగ గొబ్బెమ్మల గొప్పతనం గురించి చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా అది చూసి లాస్య,భాగ్య కుళ్లుకుంటూ ఉంటారు. అప్పుడు దివ్య అందరూ ముగ్గులు వేస్తుండగా అవి వీడియోలు తీస్తూ ఉంటుంది. అప్పుడు లాస్య ముగ్గును చూసి మురిసిపోతూ తాను ఒక ఇంటి ఇల్లాలుగా ముగ్గు వేస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. అప్పుడు భాగ్య మనకు ఎలాంటి సాంగులు సెట్ అవ్వవులే లాస్య అని అంటుంది.