వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్లి చూశావా బాబాయ్ తులసి ఇప్పుడు వ్యాపార భాగస్వామ్యం వద్దనుకుంటుంది అని అనగా వాళ్ళ బాబాయ్, నువ్వెళ్ళు అడుగురా మనసు మార్చుకుంటుందేమో అని అంటాడు. అప్పుడు తనకేనా ఆత్మ అభిమానం ఉండేది అయినా నాకు అబద్ధం ఎందుకు చెప్పింది, నా దగ్గర నిజంగా దస్తాది అని అనుకోలేదు అని అనగా వాళ్ళ బాబాయ్, చెప్పడానికి తనకంటూ పర్సనల్ విషయాలు ఉంటాయి కదా అయినా తులసి ఒక్కతే తప్పు చేసిందా? నందు కూడా చెప్పలేదు అది నందు తప్పు కూడా అవుతుంది కదా అని వాళ్ళ బాబాయ్ అంటాడు.