ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్, తులసి ఇద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. అప్పుడు అక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపించడంతో అక్కడికి వెళ్తారు. అప్పుడు సామ్రాట్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది అని అనగా ఆ షాప్ అతను ఐస్ క్రీం లానే ఉంటుంది అనడంతో వెంటనే తులసి నవ్వుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తీసుకొని తింటుండగా సామ్రాట్ మీసాలకు అయ్యేవిధంగా తింటూ ఉండటంతో అతి తులసి ఫోన్లో ఫోటో తీసి చూపించి నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత సామ్రాట్ తన చేతిలో ఉన్న ఐస్క్రీం తులసికి ఇచ్చి అక్కడ బిల్ పే చేయడానికి చూడగా అప్పుడు సామ్రాట్ పర్స్ కారులో మర్చిపోయి ఉండడంతో అక్కడికి వెళ్తాను అని అనగా ఫస్ట్ ఈ ఐస్క్రీం తినండి ఆ తర్వాత చూద్దాం అని కామెడీగా మాట్లాడుతూ ఉంటుంది తులసి.